Tuni Girl Incident: కాకినాడ జిల్లా తుని మైనర్ బాలిక అత్యాచారం కేసులో నిందితుడు నారాయణరావు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.. మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడానికి తీసుకుని వెళుతుండగా చెరువులో దూకి చనిపోయాడని పోలీసులు చెబుతున్న మాట.. అయితే, ఈ కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది.. నారాయణరావు మృతిపై ఆయన కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు, తమతో బలవంతంగా సంతకాలు పెట్టించుకున్నారని ఆరోపిస్తున్నారు..
Read Also: S*x Warfare: టెక్ కంపెనీలపై “సె*క్స్ వార్‌ఫేర్”.. చైనా, రష్యా ఆయుధాలుగా అందమైన యువతులు..
తుని గురుకుల పాఠశాలకు చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థినిని నారాయణ రావు అనే వ్యక్తి స్కూల్లో పర్మిషన్ తీసుకుని బయటకు తీసుకుని వెళ్ళాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తోటల్లోకి తీసుకువెళ్లి ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు.. కనీసం ఏం జరుగుతుందో తెలియని వయసులో మైనర్ తో పరిధి దాటి ప్రవర్తించాడు.. దానికి సంబంధించి మైనర్ కుటుంబ సభ్యులు స్కూల్ టీచర్లను నిలదీశారు.. వాళ్లు తాము మిస్టేక్ చేసామని అంటున్నారు.. గతంలో కూడా మూడు, నాలుగు సార్లు తినుబండారాలు తీసుకుని వచ్చి మైనర్ బాలిక నారాయణరావు కలిసేవాడని స్కూల్ ప్రిన్సిపల్ చెప్తున్నారు.. అయితే, ఓ వీడియో బయటకు రావడంతో నారాయణరావు వ్యవహారం బట్టబయలు అయ్యింది.. దీంతో నారాయణరావుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడానికి తీసుకుని వెళ్తున్నారు.. ఆ సమయంలో వాష్ రూమ్ కి వెళ్తానని నారాయణరావు అడిగాడని అందుకు వెహికల్ ఆపామని పోలీసులు చెప్తున్నారు.. ఇంతలో సమీపంలో ఉన్న కోమటి చెరువులో నారాయణ రావు దూకేసాడని పోలీసులు క్లారిటీ ఇస్తున్నారు.. ఆ సమయంలో నారాయణరావుకి ఎస్కార్ట్ గా ముగ్గురు పోలీసులు ఉన్నారు.. ఉదయం గజ ఈతగాళ్లు చెరువులో గాలించారు.. కొద్దిసేపటికి నిందితుడు మృతదేహం దొరికింది.. వెంటనే పోస్ట్‌మార్టం నిమిత్తం తుని ప్రభుత్వ హాస్పిటల్ కి మృతదేహాన్ని తరలించారు.. అయితే, నారాయణరావుకు ఇద్దరు భార్యలు.. అయితే వాళ్ల పిల్లలు మాత్రం నారాయణరావు మృతికి సంబంధించి తమకు అనుమానాలు ఉన్నాయని అంటున్నారు.. పోలీసులు మాత్రం అత్యవసరం అయి వెహికల్ ఆపామంటే ఆపామని చెబుతున్నారు.
తుని మైనర్ బాలిక అత్యాచారం సంచలనం సృష్టించింది.. దానికి సంబంధించి బాలిక కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు.. అతను మానసికంగా ఆందోళన చెంది ఈ నిర్ణయం తీసుకుని ఉంటాడని పోలీసులు అంటున్నారు. మరోవైపు కుటుంబ సభ్యులు మాత్రం తమ అనుమానాలను నివృత్తి చేయాలని కోరుతున్నారు.. ఇప్పటివరకు స్కూల్ నుంచి బాలికను ఐదు సార్లు నారాయణరావు బయటకు తీసుకుని వెళ్లాడు… ఇద్దరిదీ ఒకే వీధి కావడంతో నిందితుడిని బాధితురాలు తాతా అని పిలిచేది.. అదే వరుసతో స్కూల్ కి వెళ్లి ఆమెను బయటకు తీసుకొచ్చేవాడు.. ఇప్పటి వరకు బాలికపై మూడుసార్లు అత్యాచారం చేశానని నిందితుడు పోలీసులు విచారణలో తెలిపాడు.. సముద్రం దగ్గరికి బాలికను తీసుకుని వెళ్దామని అనుకున్నాడు.. కానీ ఈ లోపు ఎవరూ లేని ప్రాంతం కనిపించడంతో బండి అక్కడ ఆపి లోపలికి తీసుకుని వెళ్ళాడు.. తోటలో పనిచేసే కూలీలు ఆయనతో వాగ్వాదానికి దిగారు.. వాళ్లతో కూడా ఘర్షణకు దిగాడు నారాయణరావు.. గురుకుల పాఠశాల నుంచి కచ్చితంగా పేరెంట్స్ వస్తే మాత్రమే బయటికి పంపించాల్సి ఉంటుంది.. కానీ, టీచర్లకు సరైన అవగాహన లేకపోవడంతో ఇష్టం వచ్చినట్లు వ్యవహరించారు.. ఈ విషయాన్ని మెజిస్ట్రేట్ దృష్టికి కూడా తీసుకుని వెళ్లారు పోలీసులు.. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాటు చేశారు.
