NTV Telugu Site icon

Security Guard Robbery: అన్నం పెట్టిన ఇంటికే.. కన్నం పెట్టిన సెక్యూరిటీ గార్డ్

Security Guard Robbery

Security Guard Robbery

Security Guard Commits Theft In Function In Hyderabad: తనకు అన్నం పెట్టిన యజమాని పట్ల విశ్వాసంగా ఉండాల్సిన ఓ సెక్యూరిటీ.. ఆ యజమాని ఇంటికే కన్నం పెట్టాడు. తనపై ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము చేసి, ఏకంగా నాలుగు లక్షలు దోచుకొని పరారయ్యాడు. ఈ సంఘటన సైబరాబాద్ కమిషనరేట్ ఆర్‌జీఐఏ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. సాతం రాయి వద్ద హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారి పక్కనే ఉన్న కశిష్ ఫంక్షన్ హాల్‌లో ఓ వ్యక్తి కొంతకాలం నుంచి సెక్యూరిటీ గార్డ్‌గా పని చేస్తున్నాడు. మొదట ఇతడు విశ్వాసంగా ఉన్నట్లు నటించాడు. ఆ ఫంక్షన్ హాల్ యజమాని నమ్మకాన్ని సాధించాడు.

Rohit Sharma: టెస్ట్ మ్యాచ్ మూడు రోజులేనా.. దిమ్మతిరిగే కౌంటరిచ్చిన రోహిత్

కట్ చేస్తే.. సెక్యూరిటీ గార్డ్‌గా చేస్తున్నంతకాలం తాను ఎదగనని భావించాడో ఏమో, తాను పని చేస్తున్న ఫంక్షన్ హాల్‌లోనే చోరీకి పాల్పడ్డాడు. ఓ లాకర్‌లో రూ.4 లక్షలు ఉన్నట్టు గుర్తించిన ఆ సెక్యూరిటీ గార్డ్.. తన యజమాని ఇంటికి వెళ్లాక, ఆ డబ్బులు దోచుకున్నాడు. లాకర్ తాళాలు పగలగొట్టి, ఆ రూ.4 లక్షలు తీసుకొని, అక్కడి నుంచి జంప్ అయ్యాడు. మరుసటి రోజు ఉదయం మేనేజర్ ఫంక్షన్ హాల్‌కి వచ్చాడు. ఎక్కడ వెతికినా సెక్యూరిటీ గార్డ్ కనిపించలేదు. బహుశా టిఫిన్ చేయడానికో లేక చాయ్ తాగడానికి వెళ్లాడో అనుకుని, తన ఆఫీస్ రూమ్‌లోకి వెళ్లాడు. అక్కడ లోపల అడుగుపెట్టగానే.. ఆ మేనేజర్ ఫ్యూజులు ఒక్కసారిగా ఎగిరిపోయాయి. లాకర్ తాళాలు పగిలి ఉండటం, అందులో రూ.4 లక్షలు లేకపోవడం చూసి ఖంగుతిన్నాడు.

Husband Forces Wife: ప్రమోషన్ కోసం బాస్‌తో పడుకోమన్న భర్త.. ఆ పని చేసిన భార్య

ఇది కచ్ఛితంగా సెక్యూరిటీ గార్డ్ పనే అయ్యుంటుందని నిర్ధారించుకున్న తర్వాత.. ఆ ఫంక్షన్ హాల్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. క్లూస్ టీమ్‌ని రంగంలోకి దింపి, సాక్ష్యాలను సేకరించారు. చోరీకి పాల్పడ్డ సెక్యూరిటీ వివరాలను మేనేజర్ వద్ద నుంచి తీసుకొని, అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు.