Site icon NTV Telugu

Test Tube Baby : సికింద్రాబాద్‌ IVF సెంటర్ షాకింగ్ స్కామ్.. భర్త వీర్యానికి బదులు మరొకరిది.?

Ivf Center

Ivf Center

Test Tube Baby : నగరంలోని సికింద్రాబాద్‌లో గల ఓ టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ సెంటర్ ఇప్పుడు సంచలనంగా మారింది. పిల్లల కోసం ఆసుపత్రిని ఆశ్రయించిన ఓ దంపతులకు ఎదురైన ఊహించని సంఘటన, ఆ వైద్య కేంద్రం విశ్వసనీయతపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఈ ఘటనపై పోలీసుల తనిఖీలు కొనసాగుతున్నాయి.

వివరాల్లోకి వెళ్తే, సంతానం లేని ఓ మహిళ సికింద్రాబాద్‌లోని సృష్టి టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ సెంటర్‌ను ఆశ్రయించారు. ఆమె తన భర్త వీర్య కణాలను ఉపయోగించి సంతానం కలిగించాలని వైద్యురాలిని కోరారు. అయితే, చికిత్స అనంతరం అనుమానం వచ్చిన ఆ దంపతులు, కడుపులో ఉన్న శిశువుకు డీఎన్‌ఏ టెస్ట్ చేయించారు. ఈ టెస్టులో వచ్చిన ఫలితాలు వారిని దిగ్భ్రాంతికి గురిచేశాయి. శిశువు డీఎన్‌ఏ, భర్త డీఎన్‌ఏతో సరిపోలకపోవడం, వేరే వ్యక్తి వీర్య కణాలను ఉపయోగించి సంతానం కలిగించినట్లు తేలడంతో దంపతులు వెంటనే పోలీసులను ఆశ్రయించారు.

WHO Chikungunya Alert: 20 ఏళ్ల తర్వాత ముప్పుగా చికున్‌గున్యా.. లక్షణాలు, నివారణ మార్గాలు ఇవే..?

దంపతుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సృష్టి టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ సెంటర్‌పై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఈ ఘటనపై టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ సెంటర్ నిర్వాహకులు, సంబంధిత వైద్యురాలిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

ఈ సంఘటన ఫర్టిలిటీ క్లినిక్‌లలో పారదర్శకత, నైతిక ప్రమాణాలపై తీవ్రమైన చర్చకు దారితీస్తోంది. ఇలాంటి సున్నితమైన చికిత్సల విషయంలో నిబంధనలు, పర్యవేక్షణ ఎంత అవసరమో ఈ కేసు మరోసారి గుర్తుచేస్తోంది. విచారణ పూర్తయిన తర్వాతే ఈ కేసులో పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

IRCTC ID Block: రైల్వే కీలక నిర్ణయం.. ఇకపై టిక్కెట్ బుకింగ్ సులభంగా మారనుంది..!

Exit mobile version