Shocking murder: సహస్ర మర్డర్ జరిగిన తర్వాత పోలీసులకు ఎలాంటి సాక్ష్యం లభించలేదు. కానీ హంతకుడు ఏ రూట్లో వచ్చి ఉంటాడు, ఎలా ఇంటిలోకి చొరబడి ఉంటాడు? అనే వాటిపై రఫ్ స్కెచ్ వేశారు. కానీ అక్కడున్న సాక్ష్యాధారాలకు వారి స్కెచ్ ఎంత మాత్రం మ్యాచ్ కాలేదు. దీంతో సహస్ర ఇంట్లోకి ప్రవేశించేందుకు పక్కనే ఉన్న బిల్డింగ్ పై నుంచి దూక వచ్చని అనుమానించారు. ఆ దిశగా కూడా పోలీసులు తమ దర్యాప్తు షురూ చేశారు. దీంతో పక్కింటిలోని 3, 4 అంతస్తుల వారిని ప్రశ్నించారు. కానీ ఎవరి నుంచి ఎలాంటి క్లూ రాబట్టలేక పోయారు. చివరకు ఓ బాలుడు, మరో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఇచ్చిన క్లూ ఆధారంగా కేసును ఛేదించారు..
READ ALSO: ఏపీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం అరెస్ట్ !
ఓ బాలుడు బాల్కనీలో తచ్చాడినట్లు సమాచారం..
పక్కింట్లోని 3rd ఫ్లోర్‌లో ఉండే బాలుడు.. దాదాపు 15 నిముషాలు బాల్కనీలో తచ్చాడినట్లు మరో బాలుడు సమాచారం ఇచ్చాడు. అలాగే తన రూమ్ పక్కన.. హత్య జరిగిన రోజు అదే బాలుడు నక్కినక్కి దాక్కుని ఉన్నట్లు ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సైతం పోలీసులకు తెలిపారు. దీంతో ఈ రెండిటినీ క్రోడీకరించి హత్య చేసిన బాలున్ని అరెస్ట్ చేశారు. అతన్ని విచారించగా సంచలన విషయాలు వెలుగు చూశాయి. అతడు చెప్పిన సమాధానాలు విని పోలీసులే షాకయ్యారు.
సహస్ర శరీరంపై 18 కత్తిపోట్లు పడడంతో మృతి..
సహస్ర తమ్ముడి వద్ద ఉన్న క్రికెట్ బ్యాట్ కోసం వాళ్ల ఇంట్లో దూరినట్లు పోలీసులకు చెప్పుకొచ్చాడు బాలుడు. అందుకోసమే తమ బాల్కనీలోని వారి టెర్రస్‌పైకి దూకినట్లు వెల్లడించాడు. దగ్గరగా వేసి ఉన్న డోర్ తీసుకుని నెమ్మదిగా లోపలికి వెళ్లినట్లు వివరించాడు. బ్యాట్ తీసుకుని తిరిగి వచ్చేటప్పుడు అలికిడి కావడంతో సహస్ర అతన్ని చూసి కేకలు వేసింది. దొంగ దొంగ అని అరవడంతో ఆమెను నెట్టేశాడు. ఆ తర్వాత గొంతు నొక్కాడు. అప్పటికే తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశాడు. మొత్తంగా సహస్ర శరీరంపై 18 కత్తిపోట్లు పడడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.
టీ షర్ట్‌పై బ్లడ్ మరకలు కనిపించకుండా జాగ్రత్త..
సహస్ర నోరు మూసి కత్తితో దాడి చేయడంతో చుట్టు పక్కల ఉన్న వారెవరికీ ఆమె అరుపులు వినిపించలేదు. అందరూ ఎవరి పనుల్లో వారు నిమగ్నమై ఉన్నారు. ఇక హత్య తర్వాత మైనర్ బాలుడు కత్తిని వారి ఇంట్లోనే సింక్‌లో శుభ్రం చేసుకుని బయటకు వెళ్లాడు. వెళ్తూవెళ్తూ బయట గడియ పెట్టేశాడు. ఎలా వచ్చాడో అలాగే తిరిగి వెళ్లిపోయాడు. ఐతే సహస్ర ఉంటున్న టెర్రస్‌పై నుంచి వాళ్ల ఇంటి బాల్కనీలోకి దూకే సమయంలో బాలుడి ఇంట్లో తండ్రి, అక్కలు ఉన్నారు. వారికి కనిపించకుండా దూకేశాడు. తాను వేసుకున్న టీషర్ట్‌పై బ్లడ్ మరకలు కనిపించకుండా అక్కడే ఆరేసిన టీ షర్ట్ అడ్డుగా పెట్టుకుని ఇంట్లోకి వెళ్లిపోయాడు. హత్యకు ఉపయోగించిన కత్తిని తన ఇంట్లో ఫ్రిడ్జిపైన పెట్టేశాడు. అలాగే నేరుగా బాత్‌రూమ్‌లోకి వెళ్లి టీషర్ట్ ఉతికేసి, స్నానం చేశాడు. యధావిధిగా ఇంట్లో వాళ్లతో కలిసిపోయాడు. అసలు ఏం జరగనట్టే ప్రవర్తించాడని పోలీసులు తెలిపారు.
తల్లిని సైతం ఏమార్చిన బాలుడు..
మరోవైపు సహస్ర మర్డర్ జరిగిన రోజు నుంచి బాలుడు దాదాపు పోలీసుల వెంటే తిరిగాడు. అంతే కాదు ప్రతి రోజూ వారిని తప్పుదోవ పట్టించేందుకు కూడా ప్రయత్నించాడు. ఆ రోజు వాళ్ల ఇంటి నుంచి డాడీ డాడీ అంటూ అరుపులు వినిపించాయని చెప్పాడు. సహస్ర చాలా మంచిదని తనకు మంచి మిత్రురాలని.. ఇలా ఎవరు చంపారో తెలియదని.. తనకు భయం వేస్తుందంటూ పోలీసులు ముందు నమ్మకంగా నటించాడు. అటు తల్లిని సైతం ఏమార్చాడు. నిజానికి బాలుడి తల్లికి మొదటి రోజే అనుమానం వచ్చింది. నీవేమైనా చేశావా అని అడిగింది. కానీ తనకు ఎలాంటి సంబంధం లేదని.. అసలు సహస్రను నేను ఎందుకు చంపుతాను అంటూ బుకాయించాడు. కానీ మరుసటి రోజు కూడా బాలుడి ప్రవర్తనలో మార్పు గమనించింది తల్లి. తీవ్ర స్థాయిలో మందలించింది, ఏదైనా చేస్తే చెప్పు అని నిలదీసింది. అయినా ఎలాంటి భయం బెరుకు లేకుండా సమాధానం చెప్పాడు. పైగా నువ్వే నన్ను పోలీసులకు పట్టించేటట్లు ఉన్నావని తల్లి మీద ఫైర్ అయ్యాడు. దీంతో తల్లి సైలెంట్ అయిపోయింది. మొత్తంగా సహస్రను ఆ బాలుడే హత్య చేసినట్లు పోలీసులు అన్ని ఆధారాలు సేకరించారు. అతన్ని జువెనైల్ హోమ్‌కు తరలించారు. కేసులు నిపుణులను సంప్రదించి చార్జిషీట్ వేస్తామని పోలీసులు చెబుతున్నారు.
READ ALSO: Sahasra murder case: అసలు సహస్ర హత్య కేసులో ఏం జరిగింది?..
