Sad Love Story: తెలిసీ తెలియని వయసు ప్రేమ.. చివరకు?

Love

Love

Sad Love Story: నిండా పద్దెనిమిదేళ్లు లేవు.. కానీ ఓ అమ్మాయిని ప్రేమించాడు.. ఆ అమ్మాయి అతని ప్రేమను తిరస్కరించింది. దీంతో ఆమెకు వీడియో కాల్ చేసి మరీ సూసైడ్ చేసుకున్నాడు. ఈ దారుణమైన ఘటన హైదరాబాద్‌లోని బోడుప్పల్‌లో జరిగింది. బయటకు వెళ్లి వచ్చిన తల్లిదండ్రులు కొడుకు చావును చూసి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Cyber Crime: రూ.5 వేల కోట్ల ఆన్‌లైన్ గేమింగ్ స్కామ్.. ఆన్‌లైన్ గేమింగ్, ఫిన్‌టెక్ కంపెనీల ముసుగులో!

ఆత్మహత్య చేసుకున్న బాలుడి పేరు గంగాధరి అభినవ్. అతని వయసు 17 సంవత్సరాలు. తల్లిదండ్రులతో కలిసి హైదరాబాద్ బోడుప్పల్‌‌ లోని ఓ అపార్ట్‌మెంట్లో నివసిస్తున్నాడు. తండ్రి ప్రైవేట్ ఉద్యోగి తల్లి గృహిణిగా ఉన్నారు. అల్లారు ముద్దుగా అభినవ్‌ను పెంచుకున్నారు. చక్కగా చదువుకుంటున్నాడనుకున్నారు.. కానీ ఉన్నట్టుండి అభినవ్ సూసైడ్ చేసుకోవడంతో ఆ ఇంట్లో విషాదం నెలకొంది.

అభినవ్.. గవర్నమెంట్ ఐటీఐ కాలేజీలో రెండో సంవత్సరం చదువుతున్నాడు. అంతే కాదు మేడిపల్లిలోని మహేంద్ర కార్ల షోరూంలో ప్రాక్టికల్ ట్రైనింగ్ పొందుతున్నాడు. భవిష్యత్తుపై ఎన్నో ఆశలు, లక్ష్యాలతో ముందుకు సాగుతున్న ఈ బాలుడు ఇలా అకాలంగా నిష్క్రమించడం కుటుంబసభ్యులను, స్నేహితులను తీవ్రంగా కలచివేసింది. ఫిబ్రవరి 5న ఈ విషాద ఘటన జరిగింది. తల్లిదండ్రులు షాపింగ్ కోసం బయటకు వెళ్లారు. ఆ సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న అభినవ్ తన ప్రియురాలితో వీడియో కాల్‌లో మాట్లాడాడు. ఆ సమయంలో ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించినట్లు తెలుస్తోంది. కొద్దిసేపటికే ఫ్యాన్‌కు చున్నీతో ఉరి వేసుకున్నాడు. పరిస్థితి తీవ్రతను గ్రహించిన యువతి వెంటనే అతడి స్నేహితులకు సమాచారం అందించింది. కానీ అప్పటికే పరిస్థితి చేయిదాటి పోయింది.

BCCI Central Contracts: రోహిత్, విరాట్‌కు భారీ షాక్.. గ్రేడ్ ‘బి’ కి డిమోషన్! గిల్, బుమ్రా టాప్!

అలర్ట్ అయిన స్నేహితులు వెంటనే ఇంటికి చేరుకుని తలుపు బలవంతంగా తెరిచి అభినవ్‌ను సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. బాలుడిని ఆసుపత్రికి తీసుకెళ్లిన దృశ్యాలు అపార్ట్మెంట్‌లోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ ఘటనపై బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మానసిక ఒత్తిడి, వ్యక్తిగత కారణాల కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.