Site icon NTV Telugu

Rock fell on Auto: ఆటోపై పడిన బండరాయి.. 8 మంది అక్కడిక్కడే మృతి

Rock Fell On Auto

Rock Fell On Auto

Rock fell on Auto: బండి రాయి రూపంలో దూసుకొచ్చిన మృత్యువు.. ఆటోలో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది ప్రాణాలు తీసింది.. మహబూబాబాద్‌ జిల్లాలో ఈ ఘోర ప్రమాదం జరిగింది.. గ్రానైట్‌ లోడ్‌తో వెళ్తున్న ఓ లారీ లోని బండ రాయి.. కూలీలు ప్రయాణిస్తున్న ఆటోపై పడిపోయింది… కురవి మండలం అయ్యగారిపల్లి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది.. కూలీ పనులకు వెళ్లి.. ఆ పనులు ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్న కూలీలు.. ఓ ఆటోలో ఎక్కారు.. అయితే, పెద్ద బండరాయి ఆటోపై పడడంతో.. అక్కడికక్కడే 8 మంది మృతిచెందారు.. ఈ ఘటనలో పలువురు తీవ్రగాయాలతో బయటపడినట్టుగా తెలుస్తోంది.. మృతులంతా చిన్నగూడూరు మండలం జయ్యారం శివారులోని మంగోరి గూడెంకు చెందినవారిగా చెబుతున్నారు.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Exit mobile version