NTV Telugu Site icon

Road Accident: ఐర్లాండ్‌లో ఏపీ యువకుడు మృతి..

Road Accident

Road Accident

Road Accident: విదేశాల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మరో విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు.. జగ్గయ్యపేటకు చెందిన చిట్టూరి భార్గవ్ ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లాడు.. ఐర్లాండ్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందటం స్థానికంగా విషాదాన్ని నింపింది. జగ్గయ్యపేట పట్టణానికి చెందిన భార్గవ్.. శుక్రవారం రాత్రి స్నేహితులతో కలిసి బయటికి వెళ్తుండగా.. చెట్టును ఢీకొట్టింది కారు.. ఈ ప్రమాదంలో భార్గవ్ మృతి చెందాడు.. భార్గవ్ తండ్రి చిత్తూరు సాయిబాబా స్థానిక ఆరో ప్లాంట్ లో నివసిస్తున్నాడు.. ఉన్నత చదువులు పూర్తి చేసుకున్న భార్గవ్.. ఉద్యోగంలో చేరేందుకు సిద్ధమవుతోన్న వేళ.. జరిగి ప్రమాదం.. ఆ కుటుంబంలో తీరాన్ని దుఖాన్ని మిగిల్చింది.. చేతికి అందివచ్చిన కొడుకు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు వీడడంతో.. ఆ కుటుంబసభ్యుల దుఖాన్ని ఆపడం ఎవరితరం కావడం లేదు.

Read Also: Union Budget 2023: బడ్జెట్ ఎలా ఉన్న ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్న నిర్మలమ్మ చీర