Site icon NTV Telugu

Tragedy : ఆర్ఎంపీ వైద్యుడి నిర్లక్ష్యానికి బలైన బాలుడి.. న్యాయవాది పోరాటం

Tragedy

Tragedy

Tragedy : కురువపల్లి గ్రామానికి చెందిన 11 ఏళ్ల బాలుడు వరుణ్ తేజ మృతితో సంబంధించి జడ్చర్లకు చెందిన న్యాయవాది, సామాజికవేత్త పెద్దింటి రవీంద్రనాథ్ జాతీయ బాలల హక్కుల సంఘం (NCPCR), భారత మానవ హక్కుల సంఘం (NHRC)లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ప్రకారం.. వరుణ్ తేజ ఆరోగ్యం బాగలేదని గుర్తించిన కుటుంబం, లింగంపేటలోని RMP డాక్టర్ శ్రీకాంత్ వద్దకు తీసుకువెళ్ళారు. అయితే సరైన వైద్యం అందించకపోవడం, డాక్టర్ నిర్లక్ష్యంతో బాలుడు మృతి చెందాడు.

న్యాయవాది పెద్దింటి రవీంద్రనాథ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటన RMP లు సరైన సర్టిఫికేట్‌లు, వైద్య పరిజ్ఞానం లేకుండా గ్రామ ప్రాంతాల్లో ప్రాణాలతో చెలగాటం చేస్తున్నారన్న దానిని ఇది నిదర్శనమన్నారు. అందువలన తక్షణమే కఠిన చర్యలు తీసుకోవడం, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడడం అత్యవసరం అని ఫిర్యాదు చేశారు.

అంతేకాక, గ్రామాలలో వైద్య సేవలు అందిస్తున్న వ్యక్తులందరికి సరైన లైసెన్స్‌లు ఉండేలా, సంబంధిత నియమాలను ప్రభుత్వంగా పకడ్బందీగా అమలు చేయించాలని, అలాగే RMP శ్రీకాంత్ నిర్లక్ష్యం కారణంగా మృతిచెందిన వరుణ్ తేజ కుటుంబానికి న్యాయం, నష్టపరిహారం అందించాలని కూడా న్యాయవాది కోరారు. ఈ ఫిర్యాదు నేపథ్యంగా.. ప్రభుత్వ అధికారం వెంటనే చర్యలు తీసుకోవాలని, గ్రామీణ ప్రాంతాల్లో అమాయకుల ప్రాణాలు ప్రమాదంలో పడకుండా నియంత్రణ విధానాలను పునరుద్ధరించాలని న్యాయవాది రవీంద్రనాథ్ పిలుపునిచ్చారు.

Suside: ఇద్దరు పిల్లలకి విషమిచ్చి.. ఆపై ఆపై ఆత్మహత్య చేసుకున్న తండ్రి

Exit mobile version