Site icon NTV Telugu

Peddapuram: పెద్దాపురంలో మళ్లీ వ్యభిచార దందా.. పోలీసులే సహకరిస్తున్నారా..?

Peddapuram

Peddapuram

Peddapuram: పెద్దాపురం పేరు మళ్లీ రిపేరుకొచ్చింది. గతంలో ఎంతో కష్టపడి.. గలీజ్ దందాకు చెక్ పెడితే.. కొంత మంది మళ్లీ వచ్చి పెద్దాపురం ప్రాంతాన్ని రెడ్ లైట్ ఏరియాగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలీసుల అండదండలతోనే ఈ దందా మళ్లీ చిగురించిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కానీ కాలక్రమంలో పెద్దాపురం మారింది. తనపై ముద్ర పడిన ‘రెడ్ లైట్’ ఏరియా పేరును చెరిపేసుకుంది. పెద్దాపురంలో అంతకు ముందు ఉన్న గలీజ్ దందాలు.. వాటిని నడిపిన యాజమాన్యాలు.. కంపెనీలు.. అన్నీ కాలగర్భంలో కలిసిపోయాయి.. అంతా బాగుంది అనుకున్న సమయంలో.. ఇప్పుడు పెద్దాపురంలో ఆ.. దందా మళ్లీ మొదలైంది. బిజినెస్ మ్యాన్ సినిమాలో హీరో మహేష్ బాబు.. ముంబైలో మళ్లీ మాఫియాను కళకళలాడేలా చేస్తానని చెప్పినట్టే.. కొంత మంది మహిళలు వ్యభిచార దందాను మళ్లీ కళకళలాడించే ప్రయత్నం షురూ చేశారు. ఇప్పుడు పెద్దాపురంలో రెండు వ్యభిచార గృహాలు నడుస్తున్నాయి. విటుల రేంజ్‌ను బట్టి అమ్మాయిలను సప్లై చేస్తున్నారు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఒకప్పుడు పెద్దాపురం ఉన్న రేంజ్‌కు మళ్లీ ప్రాస్టిట్యూషన్ దందాను తీసుకు వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారన్నమాట. ఇతర ప్రాంతాల నుంచి అందమైన అమ్మాయిలను తీసుకు వచ్చి మళ్లీ దందాను యథావిధిగా నడిపిస్తున్నారు. ఎవరైనా అమ్మాయిలను నయానో భయానో భయపెడుతున్నారు. బలవంతంగా రొంపిలోకి దింపుతున్నారు.. ఇక్కడ చూడండి.. ఈ ఫోటోలో ఉన్న మహిళ పేరు భారతి. ఈమె మమూలు లేడీ కాదు కిలాడీ లేడీ. పెద్దాపురంలో మళ్లీ రెడ్ లైట్ దందాకు ఆజ్యం పోసింది. కొంత మంది యువతులను తీసుకువచ్చి వ్యభిచారం చేయిస్తోంది. కస్టమర్స్‌కు సకల సౌకర్యాలు కల్పిస్తూ ఆకర్షిస్తోంది. ఈమెకు కొంత మంది స్థానిక పోలీసులు కూడా అండగా ఉన్నారు. దీంతో మరింత రెచ్చిపోతోంది. ఇప్పుడు పెద్దాపురంలో గుట్టుగా సాగుతున్న ఈ గలీజ్ దందా ఓ మహిళ ద్వారా వెలుగులోకి వచ్చింది. తనను బ్లాక్‌మెయిల్ చేసి బలవంతంగా వ్యభిచారం కూపంలోకి దింపారని చెబుతోంది ఆ మహిళ.

READ MORE: Nigerian Drug Mafia: హైదరాబాద్‌‌లో 2500 మంది నైజీరియన్‌లు.. ఏ డ్రగ్ కేసు చూసినా వీళ్లే..!

తన కూతురును బంధించి.. తనతో వ్యభిచారం చేయించారని గోడు వెళ్లబోసుకుంది. ఆ మహిళ పోలీసులను ఆశ్రయించడంతో.. పోలీసులు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. గలీజ్ దందా చేస్తున్న భారతిని అదుపులోకి తీసుకున్నారు. ఆమెకు సహకరిస్తున్న కానిస్టేబుల్ శివరామకృష్ణ, హోంగార్డ్ శివకృష్ణను సస్పెండ్ చేశారు. వారిద్దరిపై క్రమ శిక్షణా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు సిఫారసు చేశారు పెద్దాపురం ఎస్ఐ మౌనిక. అంతే కాదు పెద్దాపురంలో రెడ్ లైట్ ఏరియాలను తలపిస్తున్న వీధుల్లో క్షుణ్నంగా తనిఖీలు నిర్వహించారు.. మరోవైపు వ్యభిచార గృహాల నిర్వాహకులలో కూడా ఆధిపత్య పోరు నడుస్తోందంటున్నారు పోలీసులు. మొత్తంగా అన్ని కంపెనీలను కూకటివేళ్లతో సహా పీకేస్తామని పోలీసులు చెబుతున్నారు. ఇందుకోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామంటున్నారు. మొత్తానికి పెద్దాపురంలో మళ్లీ వ్యభిచార దందా షురూ కావడం స్థానికంగా కలకలం రేపుతోంది. ముఖ్యంగా ప్రతి నెలా పోలీసులకు మామూళ్లు వెళ్తున్నాయనే ప్రచారం కూడా జరుగుతోంది. ఫలితంగా పోలీసుల్లో కొంత మందే ఈ దందాకు సహకరించి ప్రోత్సహిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.

READ MORE: Health Tips: ధర తక్కువ.. బెనిఫిట్స్ ఎక్కువ.. ఇదొక్కటి డైట్ లో చేర్చుకోండి!

Exit mobile version