NTV Telugu Site icon

Rajasthan Shocker: భార్యకు ఘోరమైన శిక్ష.. బైకుకి కట్టి ఈడ్చుకెళ్లిన భర్త..

Rajasthan Shocker

Rajasthan Shocker

Rajasthan Shocker: రాజస్థాన్‌లో దారుణం జరిగింది. భర్త భార్యకు ఘోరమైన శిక్ష విధించారు. నాగౌర్ జిల్లాలో ఓ ఒక వ్యక్తి తన భార్య కాళ్లను బైకు కట్టి ఈడ్చుకెళ్లిన సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె సహాయం కోసం కేకలు వేస్తున్న దృశ్యాలు కలిచివేస్తున్నాయి. నేలపై లాక్కెళ్లడంతో ఆమె శరీరానికి తీవ్రగాయాలయ్యాయి. బాధతో ఆమె ఏడుస్తున్న తీరు హృదయవిదారకరంగా ఉంది.

దాడికి సంబంధించిన 40 సెకన్ల వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గత నెలలో నేరం జరిగినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో భర్త ఒక్కడే కాకుండా ఒక మహిళ, మరో వ్యక్తి అతడికి సాయం చేసినట్లు తెలుస్తోంది. రాజస్థాన్ వీడియో విషయానికి వస్తే ఆ వ్యక్తి ఎవరనేది స్పష్టం తెలియలేదు.

Read Also: Bangalore Bus Accident: బెంగళూరు ఫ్లైఓవర్‌పై ప్రమాదం.. వాహనాలపైకి దూసుకెళ్లిన ఓల్వో బస్సు!

జైసల్మేర్‌లో తన సోదరి ఇంటికి వెళ్లాలనుకున్నందుకు సదరు భర్త, తన భార్యకు ఈ దారుణమైన శిక్ష విధించినట్లు తెలస్తోంది. ఇది వధువును ‘కొనుగోలు’ చేసిన ఘటన కావచ్చు. మరొక రాష్ట్రం నుంచి భార్యని కొనుగోలు చేసే ఆచారం జుంజును, నాగౌర్, పాలి జిల్లాలో జరుగుతుంటాయి. ఈ పద్ధతిలో కొనుగోలు చేయబడిన స్త్రీలు తన భర్త నుంచి, చాలా సందర్భాల్లో గ్రామాల్లో ఇతర పురుషుల నుంచి శారీరక, మానసిక, లైంగిక వేధింపులకు గురవుతుంటారు. వారు పొలాల్లో, ఇంటి పనులను బలవంతంగా చేయాల్సి వస్తుంది. ఓ విధంగా చెప్పాలంటే వెట్టి చాకిరి చేయించుకుంటారు. దీంతో పాటు భర్తను సంతృప్తిపరిచే సేవలు చేస్తుంటారు.

రెండు కోణాల్లో ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. ఇందులో మానవ అక్రమ రవాణా కోణంలో కేసుని విచారిస్తున్నట్లు వారు వెల్లడించారు. మహిళను 10 నెలల క్రితం రూ.2 లక్షలకు ప్రేమ్‌రామ్ మేఘ్‌వాల్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. నిరుద్యోగి, డ్రగ్స్‌కి బానిసైన వ్యక్తిగా అతడిని గుర్తించినట్లు తెలుస్తోంది. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని జైసల్మేర్‌లో ఉన్న మహిళని సంప్రదించారు. బాధితురాలు తన సోదరి వద్దకు వెళ్లాని కోరుకోవడంతోనే అతను ఆమెను ఇలా బైక్ వెనక కట్టి లాక్కెళ్లినట్లు తెలుస్తోంది.

Show comments