NTV Telugu Site icon

Rajasthan: స్కూల్ బాలికలపై లైంగిక దోపిడి, మత మార్పిడి.. బేవార్‌లో ఉద్రిక్తత..

Communal Tension

Communal Tension

Rajasthan: రాజస్థాన్‌లోని బేవార్ జిల్లా ఇప్పడు అట్టుడుకుతోంది. మతపరమైన ఉద్రిక్తతలు పెరిగాయి. జిల్లాలోని చిన్న పట్టణం మసుదాలో, పాఠశాల బాలికలను లక్ష్యంగా చేసుకుని లైంగిక దోపిడి, మతమార్పిడికి పాల్పడుతున్న సంఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఉద్రిక్తతల నడుమ మసుదాతో పాటు సమీప ప్రాంతాల్లో మార్కెట్లు మూసేశారు. ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఈ కేసులో మాజీ కౌన్సిలర్‌తో సహా పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలికల కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో మొత్తం ముగ్గురు మైనర్లతో సహా 11 మందిపై మూడు ఎఫ్ఐఆర్‌లు బుక్ అయ్యాయి.

గురువారం, నాలుగో నిందితుడిని అజ్మీర్ కోర్టులో ప్రవేశపెట్టారు .నిందితుల్లో ఒకరైన మాజీ వార్డ్ కౌన్సిలర్ అయిన హకీమ్ ఖురేషిని కోర్టు ఐదు రోజుల పోలీసు కస్టడీకి అప్పగించింది. మిగిలిన వారిని ఆరోపణలపై జైలుకు పంపినట్లు పోలీసులు గురువారం తెలిపారు. నిందితులు బాలికను సోషల్ మీడియా ద్వారా సంప్రదించి, వారికి చైనీస్ మొబైళ్లను గిఫ్టుగా ఇచ్చి, లైంగిక దోపిడీకి పాల్పడినట్లు బాలికల కుటుంబ సభ్యులు ఆరోపించారు. తమను నిందితులు బ్లాక్‌మెయిల్ చేయడం ద్వారా మతం మార్చుకున్నట్లు బాలికలు వెల్లడించడం సంచలనంగా మారింది.

Read Also: Israel Hamas: తొలి దశ కాల్పుల విరమణ.. గాజాలో ఇంకా ఎంతమంది ఇజ్రాయిల్ బందీలు ఉన్నారంటే..

10 రోజుల క్రితం మైనర్ బాలిక తండ్రి నుంచి రూ. 2000 కనిపించకుండా పోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆమె వద్ద చైనా మొబైల్ కూడా దొరికింది. గట్టిగా ప్రశ్నించడంతో నిందితుల్లో ఒకరికి డబ్బు ఇవ్వడానికి దొంగిలించినట్లు చెప్పింది. ఆమె మొబైల్ చెక్ చేయగా ఒక ముస్లిం యువకుడితో మాట్లాడుతున్నట్లు బాలిక తల్లి గుర్తించింది. బాలిక మరో సోదరి కూడా మరో ముస్లిం యువకుడితో పరిచయం ఉన్నట్లు తేలింది. యువకులు తమ మీటింగ్స్‌ని రికార్డ్ చేసి బ్లాక్‌మెయిల్ చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి.

దీని ఫలితంగా బేవార్ జిల్లాలో మతపరమైన ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. మాజీ కౌన్సిలర్ ఖురేషితో పాటు లుక్మాన్, సోహైల్ మన్సూరి, ర్యాన్ మొహ్మద్, అఫ్రాజ్ అనే నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులంతా ఒక వర్గానికి, బాలికలు మరో వర్గానికి చెందిన వారు కావడంతో ఈ ఘటన ఉద్రిక్తతలకు దారి తీసింది. ఈ సెక్స్‌టోర్షన్ రాకెట్‌లో 15 వంది అబ్బాయిలు ఉన్నట్లు బాలికలు చెప్పారు. అరెస్టయిన వ్యక్తులంతా కూలీలుగా పనిచేస్తున్నారు. బాలికలు పాఠశాలకు వెళ్లి వచ్చే మార్గంలో వీరిని అడ్డగించి, క్యాబిన్ కేఫ్‌లో కలిసేవారు. ఆ కేఫ్‌లో గంటల రూ. 200 వసూలు చేసేవారిని తేలింది.

ఈ కేసు రాజస్థాన్ అసెంబ్లీలో ప్రస్తావనకు వచ్చింది. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ బీజేపీ ప్రభుత్వం ఇలాంటి సంఘటనలను నివారించడంలో విఫలమైందని ఆరోపించింది. మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ బేవార్, టోంక్ ప్రాంతంలో బాలికలపై సామూహిక అత్యాచార కేసుల్ని ప్రస్తావిస్తూ అధికార పార్టీపై విమర్శలు గుప్పించారు.