Site icon NTV Telugu

Rajasthan: పిల్లలు పుట్టడం లేదని కోడల్ని దారుణంగా చంపిన అత్తమామలు..

Crime

Crime

Rajasthan: రాజస్థాన్‌లో దారుణం జరిగింది. పిల్లలు పుట్టడం లేదని, కోడలిని అత్తామామలు దారుణంగా హత్య చేశారు. రాష్ట్రంలోని డీగ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఖోహ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాక్రా గ్రామంలో ఈ సంఘటన జరిగింది. ఈ హత్యను దాచేందుకు, ప్రమాదవశాత్తు మృతిగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. మహిళ మృతదేహాన్ని ఇంట్లో మంటల్లో కాల్చడానికి ప్రయత్నించారు. ఆమె ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిందని నమ్మించే ప్రయత్నం చేశారు. అయితే, గ్రామస్తులకు అనుమానం రావడంతో దహన సంస్కారాలు చేపట్టే ముందు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

Read Also: Kakinada Crime: ఇద్దరి అనుమానాస్పద మృతి కేసులో సంచలన ట్విస్ట్..

సమాచారం అందుకున్న పోలీసులు, ఫోన్ ద్వారా సంప్రదించి, అంత్యక్రియలు నిర్వహించొద్దని సదరు మహిళ అత్తమామలను ఆదేశించారు. అయినా కూడా మహిళ అత్తమామాలు తొందరపడి మృతదేహాన్ని శ్మశాన వాటికకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే, దహన సంస్కారాలు జరిగే ముందే పోలీసులు అక్కడికి చేరుకుని సగం కాలిన మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతురాలు సరళకు 2005లో కాక్రా గ్రామానికి చెందిన అశోక్‌తో వివాహం జరిగింది. సరళకు పిల్లలు లేరు. దీంతోనే సర్ల హత్య జరిగిందని ఆమె కుటుంబీకులు ఆరోపించారు. ఆమె సోదరుడు విక్రాంత్, సరళ గర్భం దాల్చకపోవడంతోనే అశోక్ తరుచుగా వేధించేవాడని, కొట్టేవాడని ఆరోపించాడు.

Exit mobile version