NTV Telugu Site icon

Marriage On Video Call: సరిహద్దు దాటిన మరో పాక్ మహిళ.. రాజస్థాన్ వ్యక్తితో వీడియో కాల్‌లో పెళ్లి..

Marriage On Video Call

Marriage On Video Call

Marriage On Video Call: రాజస్థాన్‌కి చెందిన ఓ వ్యక్తి, పాకిస్తాన్‌కి చెందిన మహిళలో ప్రేమలో పడ్డాడు. అంతేకాకుండా వీరిద్దరు వీడియో కాల్‌లో పెళ్లి కూడా చేసుకున్నారు. దీనిపై సదరు వ్యక్తి మొదటి భార్య కేసు నమోదు చేసింది. వరకట్నం కోసం వేధించిడంతో పాటు తనకు ట్రిపుల్ తలాక్ చెప్పిన కారణంగా ఆమె, తన భర్తపై ఫిర్యాదు చేసింది. అంతే కాకుండా సదరు పాకిస్తానీ మహిళ భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించినట్లు చెప్పింది. తనకు, తన పిల్లలకు న్యాయం చేయాలని భారత ప్రభుత్వాన్ని కోరింది.

పాకిస్తాన్ లాహోర్‌కి చెందిన 33 ఏళ్ల మెహ్విష్ అనే మహిళతో చురులోని పితిసర్‌కి చెందిన 35 ఏళ్ల రెహ్మాన్‌ వీడియో కాల్‌లో పెళ్లి చేసుకున్నారు. ఈ తర్వాత వీరిద్దరు మరోసారి సౌదీ అరేబియాలో వివాహం చేసుకున్నారు. వీరి నికాహ్ రెండేళ్ల క్రితం జరిగింది. జూలై 27న మెహ్విష్ తన అత్తింటికి వచ్చేందుకు 45 రోజు టూరిస్ట్ వీసాపై చురు ప్రాంతానికి వచ్చింది. రెహ్మాన్ ప్రస్తుతం కువైట్‌లో ఉండగా, మెహ్విష్ మాత్రం అతడి కుటుంబంతో గడిపేందుకు ఇండియాకు వచ్చింది.

Read Also: Raja Saab: Raja Saab: ‘రాజాసాబ్‌’ ఫస్ట్‌ గ్లింప్స్‌ వచ్చేసిందోచ్‌.. రిలీజ్‌ డేట్‌ కూడా ఫిక్స్!

దీనిపై రెహ్మాన్ మొదటిభార్య 29 ఏళ్ల ఫరీదా బానో ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె భారత్ రావడంపై ఫిర్యాదు చేశారు. విదేశాల్లో భర్త వ్యాపారం చేసేందుకు తన నగలను కూడా ఇచ్చినట్లు చెప్పింది. ఆ తర్వాత తనను, తన పిల్లల్ని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మరోవైపు మెహ్విష్ భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించిన పాకిస్తాన్ గూఢచారిగా ఆమె ఆరోపించింది.

నివేదికల ప్రకారం, రెహ్మాన్, మెహ్విష్ సోషల్ మీడియా ద్వారా కనెక్ట్ అయ్యారు. వీరిద్దరి స్నేహం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకున్నారు. ఇది ఇద్దరికి రెండో వివాహమే. రెహ్మన్, మెహ్విష్‌ని అంతకుముందే ఒకసారి పెళ్లైంది. వీరిద్దరికి వేర్వేరుగా ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2006లో వివాహం చేసుకున్న మెహ్విష్‌కి మొదటి వివాహం ద్వారా ఇద్దరు కుమారులు ఉన్నారు. కొన్నేళ్ల క్రితం భర్త నుంచి విడిపోయింది. ప్రస్తుతం ఈ కేసులో మొదటి భార్య ఫరీదా బానో ఫిర్యాదు మేరకు భర్త రెహ్మాన్ ఖాన్, అతడి కుటుంబపై వరకట్న వేధింపుల కింద ఎఫ్ఐఆర్ నమోదైంది.