Blue Drum Murder : రాజస్థాన్ అల్వార్‌లో మళ్లీ బ్లూ డ్రమ్ము కలకలం సృష్టించింది. స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులకు శవం లభ్యమైంది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు.. హన్సరాజ్ అనే వ్యక్తిని చంపేసి అందులో కుక్కేశారు. మరోవైపు భార్యా పిల్లలు కూడా కనిపించకుండా పోవడంతో ఆ వ్యక్తి హత్య.. మిస్టరీగా మారింది. రాజస్థాన్‌లోని తిజారా జిల్లా అల్వార్ ఆదర్శనగర్‌లోని ఓ ఇంటి నుంచి కొద్ది రోజులుగా దుర్వాసన వస్తోంది. దీనిపై స్థానికులు రోజూ చర్చించుకుంటూనే ఉన్నారు. కానీ రోజు రోజుకు దుర్గంధం ఎక్కువవుతోంది. ఈ క్రమంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు స్థానికులు…
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బ్లూ డ్రమ్ము నుంచి దుర్వాసన వస్తున్నట్లు గుర్తించారు. దాన్ని తెరిచి చూడగా.. అందులో వ్యక్తి శవం బయటపడింది. ఆ ఇంట్లో ఉండే హన్సరాజ్ డెడ్ బాడీగా గుర్తించారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన హన్సరాజ్.. రాజస్థాన్‌కు పని కోసం వచ్చి అక్కడే సెటిల్ అయ్యాడు. అతనికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు… హన్సరాజ్ మృతదేహం కుళ్లిపోయి ఉంది. అతను చనిపోయి చాలా రోజులు అవుతున్నట్లు చెబుతున్నారు పోలీసులు. హన్సరాజ్.. స్థానికంగా ఉన్న ఇటుక బట్టీలో పని చేస్తున్నట్లు చెబుతున్నారు. ఐతే అతని మర్డర్ జరిగిన తర్వాత నుంచి భార్య పిల్లలు కనిపించకుండా పోయారు. యూపీలో ఉన్న హన్సరాజ్ కుటుంబసభ్యులను పోలీసులు సంప్రదిస్తున్నారు…
హన్సరాజ్ ను ఎవరు చంపి ఉంటారు? ఒకవేళ అతనికి ఎవరితోనైనా గొడవలు ఉన్నాయా? కుటుంబ తగాదాల వల్ల హత్య చేశారా? అసలు భార్య పిల్లలు ఏమయ్యారు? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. గతంలో ప్రియుడి కోసం కొంత మంది భార్యలు ఇలా భర్తను చంపి డ్రమ్ములో పెట్టిన ఘటనలు ఉండడంతో హన్సరాజ్ మర్డర్ సైతం కలకలం రేపుతోంది..
Film Federation: చర్చలకు పిలిపు.. నిరసన తాత్కాలిక నిలుపుదల..
