రాజస్థాన్ అజ్మీర్‌లో దారుణం చోటు చేసుకుంది. మూడేళ్ల పాపను నిద్ర పుచ్చి మరీ నదిలో పడేసి చంపేసింది తల్లి. అజ్‌మేర్‌లో ఓ కన్నతల్లి నిద్రపోతున్న మూడేళ్ల పాపను ప్రియుడి మాట విని సరస్సులో పడేసింది. అన్నాసాగర్ సరస్సులో బుధవారం ఓ బాలిక మృతదేహం దొరికింది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ వారణాసికి చెందిన అంజలి మహిళకు గతంలో పెళ్లయి.. మూడేళ్ల పాప కూడా ఉంది. ఆమె భర్తతో విబేధాల కారణంగా విడిపోయి.. ఓ వ్యక్తితో సహజీవనం చేస్తోంది. ప్రియుడికి అంజలితో పాటు బిడ్డను ఉంచుకోవడం ఇష్టం లేకపోవడంతో.. ఆమె తీవ్ర ఒత్తిడికి లోనైంది. తన పాప కావ్యను వదిలించుకునేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే అజ్మీర్‌లోని ఆనా సాగర్ సరస్సులో పాపను పడేసింది.
తన బిడ్డ కనిపించట్లేదని.. తప్పిపోయిందని.. పోలీసులను ఆశ్రయించగా.. వివరాలు అడుగుతుండగా ప్రతిసారి మార్చి చెప్పడంతో అనుమానం మొదలైంది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా చేసుకుని దర్యాప్తు చేయగా అసలు విషయం బయటపడింది. గట్టిగా విచారించడంతో నేరాన్ని ఒప్పుకుంది. సరస్సు చుట్టూ నిర్మించిన రైలింగ్ లేని చోటు నుంచి బిడ్డను నదిలోకి తోసేసినట్లు అంగీకరించింది. పాప గురించి వెతికిన పోలీసులు.. సరస్సులో ఆమె మృతదేహాన్ని గుర్తించారు. ఆమెపై హత్య కేసు నమోదు చేసి .. విచారణ చేపట్టారు.