Site icon NTV Telugu

Harassment: నీ ఏజ్ ఏందీ.. కింద గేజ్ ఏందీ.. ట్రైన్ లో ఆ గలీజ్ పనులేంది

Untitled Design (1)

Untitled Design (1)

ప్యాసింజర్ రైలులో బాలిక పట్ల ఒక వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించారు. రైలులో పెద్దగా రద్ధీ లేకపోయినా.. ఓ బాలిక పక్కనే కూర్చుని ఆమెను తాకేందుకు ప్రయత్నించాడు. మరో ప్రయాణికుడు తన మొబైల్‌లో రహస్యంగా చిత్రీకరించాడు. వీడియో తీస్తున్న తోటి ప్రయాణికుడు అతడిని ప్రశ్నించగా.. నిందితుడు పట్టుబడ్డాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

రైలు బోగీలో పెద్దగా రద్దీ లేదు. అయినా ఓ వ్యక్తి బాలిక పక్కన అతికినట్లు కూర్చున్నాడు. రహస్యంగా ఆమెను అనుచితంగా తాకుతూ ఉన్నాడు. ఈ మొత్తం సంఘటనను మరో ప్రయాణికుడు వీడియో తీశాడు. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియదు. వీడియో తీసిన ప్రయాణికుడు నిందితుడిని ప్రశ్నించాడు. మొదట ఆ వ్యక్తి మాట మార్చడానికి ప్రయత్నించాడు. చివరకు తప్పక తన నేరాన్ని పరోక్షంగా అంగీకరించాడు.

ఈ దారుణ ప్రవర్తనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంఘటనపై అధికారిక పోలీసు రికార్డులు ఏవీ లేవు.ఒక పోస్ట్ ప్రకారం, ఈ సంఘటన జనరల్ బోగీలో జరిగింది. “కళ్ళద్దాలు పెట్టుకున్న ఈ వ్యక్తి తన నీచ మనస్తత్వానికి లోనయ్యాడు. సొంత కూతురు వయసు బాలికను అసహ్యకరంగా తాకడానికి ప్రయత్నించాడు. ఇలాంటి మలిన మనసున్న వారే సమాజంలో యువతులను నిత్యం వేధిస్తారు” అని రాశారు.ఒక యూజర్, “రద్దీగా ఉన్న బోగీలో కూడా ఇలాంటి పని చేయటానికి తెగించిన అతడి ధైర్యమే ఆశ్చర్యం. ఇలాంటి వికృత మనస్తత్వ వ్యక్తులకు కఠిన శిక్ష పడాలి” అని కోరారు.మరికొందరు “వీడియో తీసిన వ్యక్తి ఇతడిని ఎందుకు కొట్టలేదు?” అని ప్రశ్నించారు. “అరెస్టు చేయాలి”, “దర్యాప్తు చేసి దోషిగా తేలితే శిక్షించాలి” అని డిమాండ్‌ చేశారు.

Exit mobile version