NTV Telugu Site icon

Punjab: పీఎస్‌లోనే రివాల్వర్‌తో కాల్చుకుని ఏఎస్సై ఆత్మహత్య.. వీడియో రికార్డు చేసి మరీ..

Asi Suicide

Asi Suicide

Punjab: పంజాబ్‌లో తన సీనియర్‌ తనను అవమానించాడని ఆరోపిస్తూ అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ ఈ ఉదయం పోలీస్ స్టేషన్‌లో తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతను ఒక వీడియో కూడా రికార్డ్ చేశాడు. అందులో అతను తన జీవితాన్ని ముగించడానికి గల కారణాన్ని వెల్లడించాడు. హోషియార్‌పూర్‌లోని హరియానా పోలీస్ స్టేషన్‌లో ఏఎస్సైగా విధులు నిర్వహిస్తున్న సతీష్ కుమార్.. గురువారం తనిఖీ సందర్భంగా తండా పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఓంకార్ సింగ్ తనపై దుర్భాషలాడాడని ఆరోపించారు. ‘నన్ను అలా అవమానించడం కంటే.. కాల్చి చంపితే బాగుండేదని నేను చెప్పాను’ అని వీడియోలో పేర్కొన్నాడు. ఓ కేసు విషయంలో తన సమాధానంతో ఎస్‌హెచ్‌వో సంతృప్తి చెందలేదని సతీష్‌కుమార్‌ తెలిపాడు. “మరుసటి రోజు పంజాబ్, హర్యానా హైకోర్టులలో విచారణ జరగాల్సిన కేసుల గురించి అతను నన్ను అడిగాడు. నేను డీల్ చేస్తున్న ఒక కేసు మాత్రమే ఉందని, ఇతర కేసుల వివరాలను సంబంధిత వ్యక్తుల నుంచి కనుగొనవచ్చని నేను అతనితో చెప్పాను.” అని ఆయన పేర్కొన్నారు.

Kishan Reddy: సెప్టెంబర్17న తెలంగాణ విమోచన దినోత్సవం.. వేడుకల్లో అమిత్ షా

ఆ తర్వాత ఎస్‌హెచ్‌వో తనను అవమానపరిచినట్లు ఏఎస్సై సతీష్‌ కుమార్ వీడియోలో వెల్లడించాడు. అక్కడితో ఆగకుండా రికార్డు బుక్‌లో తనపై ఫిర్యాదు కూడా నమోదు చేశాడని చెప్పాడు. ఈ ఘటన తర్వాత తన జీవితాన్ని ముగించుకోవాలని నిర్ణయించుకున్నానని చెప్పుకొచ్చాడు. ఈ ఘటన అనంతరం ఎస్‌హెచ్‌ఓను పోలీస్ లైన్‌కు బదిలీ చేసి విచారణకు ఆదేశించినట్లు పోలీసులు తెలిపారు. జూనియర్ పోలీసులకు ఏదైనా సమస్య ఎదురైతే తనను సంప్రదించాలని హోషియార్‌పూర్‌లోని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సర్తాజ్ సింగ్ చాహల్ విజ్ఞప్తి చేశారు.