NTV Telugu Site icon

Doctor Suicide: అనకాపల్లిలో ప్రైవేట్ ఆస్పత్రి డాక్టర్ ఆత్మహత్య

Vizag Doctor

Vizag Doctor

అనకాపల్లిలో ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్ మృతి కలకలం రేపింది. అనకాపల్లి డీఎస్పీ సునీల్ కుమార్ మాట్లాడుతూ.. డాక్టర్ శివ కుమార్ ది ఆత్మహత్యే అని తేల్చారు. నిన్న రాత్రి 7 గంటల సమయంలో అతను ఉంటున్న అపార్ట్మెంట్ పై నుండి దూకి సూసైడ్ కి పాల్పడ్డాడు. మాకు రాత్రి 9 గంటల సమయంలో సమాచారం అందింది. ఏడాది క్రితం వివాహం చేసుకుని 5 నెలల నుండి ఈ అపార్ట్మెంట్ లో ఉంటున్నాడు. కొన్ని నెలల క్రితం శివకుమార్ కి ఓ ఆక్సిడెంట్ జరిగిందన్నారు.

ఈ మధ్య కాలంలో కొత్తగా క్లినిక్ పెట్టుకున్నారు. క్లినిక్ కి పేషంట్లు సరిగా రావడం లేదని డిప్రెషన్ కి గురయ్యాడని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే ఆత్మహత్య కు పాల్పడ్డాడన్నారు డీఎస్సీ సునీల్ కుమార్. అంతకుముందు అనకాపల్లి రఘురాం కాలనీ రఘురాం అపార్ట్మెంట్ సెల్లార్ లో డాక్టర్ అనుమానాస్పద మృతి కేసు వెలుగులోకి వచ్చింది. ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు పోలీసులు. ప్రమాదవశాత్తు అపార్ట్ మెంట్ పై నుండి పడి మృతి చెందినట్లుగా భావించారు పోలీసులు. సీసీ టీవీ పుటేజ్ పరిశీలించిన పోలీసులు ఆత్మహత్యగా నిర్దారణకు వచ్చారు. మృతుడు శివకుమార్ అనకాపల్లి లో ఉషా ప్రేమ్ ప్రైవేట్ హాస్పిటల్ లో డాక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు. ముందు హత్యగా భావించారు. చివరకు డాక్టర్ ది ఆత్మహత్యగా తేల్చారు. మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.

Agneepath Scheme: ఇన్ఫోసిస్‌ కో ఫౌండర్‌ నందన్‌ నిలేకని ఆసక్తికర వ్యాఖ్యలు