Site icon NTV Telugu

Uttar Pradesh: మధురలో దారుణం.. 75 ఏళ్ల పూజారిని చంపిన దుండగులు..

Crime News

Crime News

Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. మధురలో 75 ఏళ్ల పూజారిని గుర్తు తెలియన దుండగులు కొట్టి చంపారు. కాళ్లు, చేతులు కట్టేసి కొట్టి చంపారు. చనిపోయిన వ్యక్తిని హరిదాస్ మహారాజ్ గా గుర్తించారు. కాళ్లు, చేతులను వెనక్కి కట్టేసి, తలపై ఇటుకతో మోది హత్య చేశారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

Read Also: K. Laxman: ధన్యవాద్ మోడీ పేరుతో సమ్మేళన సదస్సులు.. ఓబీసీ మోర్చా నిర్ణయం

ఆలయం ప్రాంగణంలోని తన రూంలో హరిదాస్ మహరాజ్ శవమై కనిపించారని ఎస్పీ త్రిగున్ బిషెన్ వెల్లడించారు. మంగళవరాం ఉదయం భక్తులు మృతుడికి ఆహారాం తీసుకురావడానికి గుడికి వచ్చిన సందర్భంలో హత్య విషయాన్ని గుర్తించారు. పూజారి చేతులు, కాళ్లు కట్టబడి ఉన్నాయని తలపై ఇటుకతో కొట్టిన గుర్తులు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. తీవ్ర రక్తస్రావంతో మరణించినట్లు అధికారులు తెలిపారు. ఘటనాస్థలాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆధారాలను సేకరిస్తున్నారు.

Exit mobile version