NTV Telugu Site icon

Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో దారుణం..గర్భిణిపై గ్యాంగ్ రేప్ చేసి, నిప్పంటించారు..

Crime

Crime

Madhya Pradesh: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. గర్భిణి అని చూడకుండా ముగ్గురు వ్యక్తులు రాక్షసుల్లా ప్రవర్తించారు. మొరెనా జిల్లాలో 34 ఏళ్ల గర్భిణిపై క్రూరంగా అత్యాచారం చేసి, చంపేందుకు నిప్పటించారు. ప్రస్తుతం బాధితురాలు ఆస్పత్రిల్లో ప్రాణాల కోసం పోరాడుతోందని పోలీసులు శనివారం తెలిపారు. 80 శాతం గాయాలైన మహిళ గ్వాలియర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Read Also: Arvind Kejriwal: 2024లో బీజేపీ గెలిచినా.. 2029లో ఆ పార్టీ నుంచి దేశాన్ని విముక్తి చేస్తాం..

అంబాహ్ పట్టణానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న చాంద్ కా పురా గ్రామంలో శుక్రవారం ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. భర్త అత్యాచారం ఆరోపణలపై మరో మహిళతో రాజీ కుదుర్చుకునేందుకు బాధితురాలు గ్రామానికి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. అయితే, మహిళ ఇంట్లో ఉన్న ముగ్గురు వ్యక్తులు బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ముగ్గురు వ్యక్తులతో పాటు, ఆ మహిళ బాధితురాలిపై పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు అధికారులు వెల్లడించారు. మొదట ఆమెపై సామూహిక అత్యాచారం జరిపిన తర్వాత, నలుగురు కూడా ఆమెను చంపేందుకు చూశారు.

అత్యాచారం ఆరోపణలతో బాధితురాలి భర్త ఇటీవల జైలు నుంచి బయటకు వచ్చారు. ఎవరైనా అతనిపై ఆరోపణలు చేశారో, ఆ మహిళతో సయోధ్య కోసం బాధిత మహిళ ప్రయత్నించిన నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితురాలు మేజిస్ట్రేట్‌ వద్ద తన వాంగ్మూలాన్ని నమోదు చేయగా, పోలీసులు ఆమె స్టేట్‌మెంట్‌ను ఇంకా నమోదు చేయలేదని, దర్యాప్తు జరుగుతోందని బాధితురాలి భర్త చెప్పాడు.