NTV Telugu Site icon

Bihar: బీహార్‌లో దారుణం.. ఐదుగురు కుటుంబ సభ్యులు హత్య

Bhiarmurder

Bhiarmurder

బీహార్‌లో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు హత్యకు గురయ్యారు. ఈ ఘటన భాగల్‌పూర్‌లోని ప్రభుత్వ క్వార్టర్‌లో చోటుచేసుకుంది. ఒకేసారి ఐదుగురు హత్యకు గురికావడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

బీహార్‌ భాగల్‌పూర్‌లోని ప్రభుత్వ క్వార్టర్‌లో ఒక మహిళా పోలీస్ కుటుంబం నివాసం ఉంటుంది. మహిళా పోలీస్ నీతూ కుమారి, భర్త పంకజ్, పిల్లలు శివాంశ్ (నాలుగున్నరేళ్లు), శ్రేయ (మూడున్నరేళ్లు), నీతు అత్తగారు ఆశాదేవి (65) నివాసం ఉంటున్నారు. అయితే నీతూ కుమారి తన పిల్లలను, అత్త గారును చంపేసింది. దీంతో కోపోద్రేకుడైన పంకజ్.. నీతూ కుమారి పీకకోసి చంపేశాడు. అనంతరం ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు పంకజ్ ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. నీతూ కుమారికి అక్రమ సంబంధం ఉందని పంకజ్ సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. అక్కడే ఉన్న సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నీతూ కుమారి అక్రమ సంబంధం పెట్టుకుందని పంకజ్ సూసైడ్ నోట్‌లో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. ఆమె పిల్లలను, తల్లిని చంపేసిందని.. ఆ కోపంతో భార్యను చంపినట్లుగా పంకజ్ నోట్‌లో తెలిపాడు. ఒకేసారి ఐదుగురు మృత్యువాత పడడంతో బంధువుల తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

Show comments