NTV Telugu Site icon

Kolkata Doctor Case: ఆస్పత్రిలో అర్ధరాత్రి బీభత్సం.. ఆనవాళ్లు చెరిపేసిన 9 మంది అరెస్ట్

Kolkatadoctorcase

Kolkatadoctorcase

ఓ మహిళా డాక్టర్ ఆస్పత్రిలోనే అత్యంత క్రూరంగా.. దారుణాతి దారుణంగా అత్యాచారానికి గురై హత్య చేయబడింది. ఈ ఘటన దేశ ప్రజల గుండెలను కలిచివేసింది. ఆమె పోస్టుమార్టం రిపోర్టును బట్టి ఎంత హింసాత్మకంగా హత్యాచారానికి గురైందో అర్ధమవుతుంది. మానవత్వం ఉన్న మనుషులంతా ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. అంతేకాకుండా తమకు రక్షణ కల్పించాలంటూ డాక్టర్లు, నర్సులు, మహిళా సంఘాలు రోడ్డెక్కి నిరసనన వ్యక్తం చేస్తున్నారు. ఇక కోల్‌కతా ఆర్‌జీ కర్ ఆస్పత్రి దగ్గర కూడా ఆందోళనలు కొనసాగుతున్నాయి. అయితే గురువారం అర్ధరాత్రి వైద్యులంతా పెద్ద ఎత్తున నినసన తెలుపుతుకున్నారు. అంతే ఊహించని రీతిలో అర్ధరాత్రి రౌడీలు, గూండాలు, అల్లరిమూకల సమూహం వచ్చి నానా బీభత్సం సృష్టించారు. వైద్యులు, నర్సులపై ఇష్టానురీతిగా దాడులకు తెగబడ్డారు. పోలీసులు ఉన్నా కూడా ప్రేక్షకుల్లా చూశారే తప్ప.. బెదరగొట్టే ప్రయత్నం చేయలేదు. ఇక అల్లరిమూకలు ఆస్పత్రి లోపలికి వెళ్లి హత్యాచార ఘటన స్థలం దగ్గర ఉన్న ఆధారాలను చెరిపివేశారు. ఈ ఘటన ఒక ప్రణాళిక బద్ధంగా జరిగినట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాల వైరల్ అవుతున్నాయి.

అల్లరిమూకలు చేయాల్సిన బీభత్సమంతా చేశాక.. తీరిగ్గా పోలీసులు రంగ ప్రవేశం చేసి గూండాలను చెదరగొట్టారు. లాఠీఛార్జ్, భాష్పవాయువు ప్రయోగించారు పోలీస్ కమిషనర్ ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అల్లరిమూకలు సృష్టించిన బీభత్సం తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ప్రతిపక్ష పార్టీలు తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. టీఎంసీ గూండాలే ఆస్పత్రిలో బీభత్సం సృష్టించాయి. హత్యాచార ఘటనకు సంబంధించిన ఆధారాలు చెరిపివేశారని కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాలు ఆరోపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే కోల్‌కతా ఆసుపత్రిలో హింసాకాండకు పాల్పడిన 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే కొంత మంది ఫొటోలను కూడా విడుదల చేశారు. వారి వివరాలను సేకరిస్తున్నారు. బుధవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ఆర్‌జీ కర్ ఆస్పత్రి దగ్గర ప్రారంభమైన జాగరణ సందర్భంగా అల్లరిమూకలు ఆసుపత్రి ఆవరణలోకి ప్రవేశించి దౌర్జన్యానికి దిగారు. వాహనాలపై దాడి చేశారు. ప్రజా ఆస్తులను ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు లాఠీచార్జ్‌తో పాటు బాష్పవాయువు షెల్స్‌ను ప్రయోగించాల్సి వచ్చింది. 15 మంది పోలీసులు గాయపడ్డారని కోల్‌కతా పోలీసులు తెలిపారు.

ఆగస్టు 9న ఆర్‌జీ కర్ ఆస్పత్రిలో అర్ధరాత్రి వైద్యురాలు హత్యాచారానికి గురైంది. అత్యంత క్రూరంగా ఆమెపై సామూహిక అత్యాచారం జరిగినట్లుగా పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఆమెలో 150 మిల్లీగ్రాముల వీర్యం ఉన్నట్లుగా తేలింది. గ్యాంగ్‌రేప్ కారణంగానే ఇంత వీర్యం ఉంటుందని వైద్యులు పేర్కొ్న్నారు. అలాగే బాధితురాలు తీవ్ర ప్రతిఘటన చేయడంతోనే ఆమెకు ఎక్కువ గాయాలు అయినట్లుగా అభిప్రాయపడుతున్నారు. అత్యంత హింసాత్మకంగా ఆమెపై దాడి జరిగిందని డాక్టర్లు పేర్కొంటున్నారు.