Church Pastor: ప్రపంచం టెక్నాలజీతో దూసుకుపోతోంది. కానీ, ఇంకా మూఢనమ్మకాలను మాత్రం ప్రజలు వదలడం లేదు. భక్తి ఉండడం తప్పు కాదు.. కానీ, ఆ భక్తి పేరుతో ప్రజలను మోసం చేయడం, తమ మతంలోకి రావాలని ప్రేరిపించడం తప్పు. తాజాగా ఒక పాస్టర్ వింత చేష్టలు ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నాయి. గన్నవరం మండలం గొల్లనపల్లి గ్రామంలో నాగ భూషణం అనే పాస్టర్ కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. అతనికి చర్చ్ కూడా ఉంది. అయితే గత పది రోజుల నుంచి అతనిలో మార్పు కనిపిస్తుందని కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు.
దేవుడు తనతో మాట్లాడి పరలోకానికి రమ్మనట్లు చెప్తున్నాడని, దేవుడి సన్నిధానంలోనే గొయ్యి తీసి తనను పాతిపెడితే దేవుడు మూడు రోజుల్లో లేచి వచ్చినట్లు తాను లేచి వస్తాను అని చెప్పుకొస్తున్నాడు. చెప్పడమే కాకుండా ఆచరచ్ ప్రాంగణంలో సమాధి కోసం గొయ్యిని కూడా తవ్విస్తున్నడడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. పది రోజుల నుంచి అతనిలో ఈ మార్పు కనిపిస్తుందని, అంతకుముందు ఎప్పుడు ఇలా ప్రవర్తించలేదని కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు. ఈ ఘటనపై గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు చర్చ్ పాస్టర్ ను విచారిస్తున్నారు.