NTV Telugu Site icon

Radha Family: రాధను చంపింది పోలీసులా? మావోయిస్టులా?.. మాకు తెలియాలి..

Radha Family

Radha Family

Radha Family: కోవర్టు అనే అనుమానంతో నక్సలైట్లు తమ సహచరురాలిని హత్య చేసిన ఘటన కలకలం రేపింది. మావోయిస్టులు మెడికల్ స్టూడెంట్ రాధను హతమార్చిన ఘటనపై రాధా తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాధను చంపింది పోలీసులా? మావోయిస్టులా?.. మాకు తెలియాలంటూ డిమాండ్ చేశారు. ఏడేళ్ళ క్రితం నా కూతురు రాధ కనిపించకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడేళ్ళ క్రితం నా కూతురును చూశా, ఇప్పుడు శవమై కనిపించిందని కన్నీరుమున్నీరుగా విలపించారు. ఎక్కడ ఉన్నా బాగుంటే చాలని అనుకున్నా, కాని ఇలా చంపుతారని అనుకోలేదని వాపోయారు. మూడు రోజుల క్రితం పోలీసులు ఇంటికి వచ్చి మీ కూతురు ఇంటికి వస్తుందని చెప్పారని తెలిపారు.

READ MORE: బొద్దింకలను పాదాలతో నలిపితే సైడ్ ఎఫెక్ట్స్..!

ఇప్పుడేమో ఆమె శవాన్ని అప్పగించారని ఆవేదన వ్యక్త చేశారు. నా కూతురు నా కొడుకు పై లేనిపోని అభాండాలు మోపుతున్నారని మండిపడ్డారు. నిన్న ఉదయం ఫోన్ చేసి రాధ చనిపోయిందని చెప్పారని అన్నారు. అడవిలో కీ తీసుకెళ్ళి మూట కట్టి అప్పగించారని తెలిపారు. నా కూతురును ఎవరు చంపారో మాకు తెలియాలని డిమాండ్ చేశారు. దళితురాలు అని కూడా చూడకుండా చంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదహారేళ్ళ పిల్లను తీసుకెళ్ళి చంపారని వాపోయారు. ఇంటికి లక్షల రూపాయలు పంపించిందని చెబుతున్నారని.. అలా డబ్బులు పంపిస్తే మా పరిస్తితి ఇలా ఎందుకు ఉంటుంది? అని ప్రశ్నించారు. డబ్బులు సంగతి దేవుడెరుగు, అసలు నా కూతురుతో ఏడేళ్లుగా మాట్లాడలేదని అన్నారు. మా రాధను పోలీసులు చంపారా. లేక మావోయిస్టులా? అనేది మాకు తెలియాలని డిమాండ్ చేశారు.

READ MORE: Adilabad Students: ప్రిన్సిపల్, వార్డన్ వేధిస్తున్నారు.. పోలీస్ స్టేషన్ ముందు విద్యార్థులు నిరసన..

రాధా అలియాస్ నీల్సో ఆరేళ్ల క్రితం మావోయిస్టు పార్టీలో చేరింది. పోలీసులకు కోవర్టు మారిందని సమాచారంతో మావోయిస్టు పార్టీ మరణశిక్ష విధించింది. పోలీసులకు లొంగిపోయి పూర్తిగా రాధా సోదరుడు సూర్యం ఏజెంట్ గా పని చేస్తున్నాడంటూ మావోయిస్టు పార్టీ లేఖలో పేర్కొంది. రాధాపై అనుమానం రావడంతో 3 నెలల క్రితం కమాండర్ బాధ్యత నుంచి సస్పెండ్ చేశారు. తెలంగాణ, ఛత్తీస్గడ్ ఇంటలిజెన్స్ అధికారులతో సంబంధం పెట్టుకున్నట్లు మావోయిస్టు పార్టీ అనుమానం వ్యక్తం చేసింది. రాధా ద్వారా పార్టీ కీలక సమాచారాన్ని ఇంటెలిజెన్స్ పోలీసులకు వెల్లడించింది.. అంటూ లేఖలో పేర్కొంది. మావోయిస్టు పార్టీ నిర్ణయం మేరుకే రాధాకు మరణశిక్ష విధించామని మావోయిస్టు పార్టీ తెలిపింది.
Extremely Sad: మురికికాలువలో రెండేళ్ల చిన్నారి.. 12 గంటల తరువాత మృతదేహం లభ్యం