Site icon NTV Telugu

పంజాగుట్ట చిన్నారి మృతి కేసు..పోస్టుమార్టంలో ఏముంది?

పంజాగుట్ట చిన్నారి మృతి కేసులో పోస్ట్ మార్టం నివేదికలో కీలక విషయాలు బయటపడ్డాయి. చిన్నారి కడుపులో బలంగా తన్నడం వల్లే మృతిచెందిందంటున్నారు వైద్యులు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసుల దర్యాప్తు జరుపుతున్నారు. నిందితులు చిన్నారి కడుపులో బలంగా తన్నినట్టు పోలీసులకు అందిన గాంధీ ఆసుపత్రి పోస్ట్ మార్టం నివేదికలో తేలింది.

ఘటన రోజు మొదట అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. పోస్ట్ మార్టం నివేదిక అందడంతో హత్య కేసు గా నమోదు చేసుకుని దర్యాప్తు జరిపిన పోలీసులు. 15 బృందాలతో కేసు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. పంజాగుట్ట పోలీసులతో పాటు సిటీ, వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసు బృందాల దర్యాప్తుతో కొలిక్కి వస్తోంది చిన్నారి కేసు. సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలించిన పోలీసులు చిన్నారి హంతకుల కోసం వేట కొనసాగిస్తున్నారు. త్వరలోనే కేసు కొలిక్కి వస్తుందని భావిస్తున్నారు.

సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన ఓ వాహనం నంబర్ ట్రేస్ అవుట్ చేశారు. సీసీ టీవీ ఫుటేజ్ ద్వారా కొలిక్కి వచ్చింది ఈ కేసు దర్యాప్తు. సవతి తల్లి ప్రమేయంపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల అదుపులో నిందితులు వున్నారని తెలుస్తోంది. మరో 24 గంటల్లో నిందితులను మీడియా ముందు ప్రవేశ పెట్టే అవకాశం కనిపిస్తోంది. ఐదు రోజుల సుదీర్ఘ దర్యాప్తు అనంతరం కొలిక్కి వస్తోంది కేసు.

Exit mobile version