Site icon NTV Telugu

Man Kills Wife: అక్రమ సంబంధం అనుమానం.. 19 ఏళ్ల భార్య సజీవ దహనం..

Crime

Crime

Man Kills Wife: పాకిస్తాన్‌లో దారుణం జరిగింది. అనుమానంతో భార్యను సజీవ దహనం చేశాడు. ఈ ఘటన ఆ దేశంలోని పంజాబ్ ప్రావిన్సులో చోటు చేసుకుంది. కొత్తగా పెళ్లైన 19 మహిళను ఆమె భర్త పరువు పేరుతో కాల్చి చంపినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. బాధితురాలు సబా ఇక్బాల్‌ని భర్త అలీ రజా అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో జూలై 28న లాహోర్‌కి 400 కి.మీ దూరంలోని బహవల్ నగర్ ‌లో హత్య చేశాడు.

Read Also: yashashree shinde case: యశశ్రీ హత్య కేసులో సంచలన విషయాలు.. తప్పించుకునేందుకు నిందితుడు దావూద్ మాస్టర్ ప్లాన్..

సబా రజా, అలీ రజా ఇద్దరూ 8 నెలల క్రితం వివాహం చేసుకున్నారు. పెళ్లైన కొన్ని రోజులకే తన భార్యకు వేరే వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని అలీ రజా అనుమానించడం ప్రారంభించాడు. ఈ నేపథ్యంలో సబా గొడవలతో విసిగిపోయి పుట్టింటికి వెళ్లిపోయిందని, అప్పటి నుంచి ఆమె కనిపించకుండా పోయిందన రజా తనకు జూలై 28న ఫోన్ చేసి చెప్పినట్లు యువతి తండ్రి మహ్మద్ ఇక్బాల్ తెలిపారు.

పుట్టింటికి వెళ్లిందని చెప్పినప్పటికీ అక్కడి చేరుకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు రజా ఇంటికి వెళ్లారు. ఆమె కోసం వెతకడం ప్రారంభించారు. మరుసటి రోజు ఉదయం సబా కాలిపోయిన పరిస్థితుల్లో మృతదేహంగా కనిపించింది. నిందితుడు అలీ రజా నేరం అంగీకరించడంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. సజీవ దహనానికి ముందు సబాను దారుణంగా హింసించినట్లు పోలసీులు వెల్లడించారు. తన భార్యకు వేరే వ్యక్తితో అక్రమ సంబంధం ఉండనే కారణంతోనే హత్య చేసినట్లు నిందితుడి రజా తెలిపాడు. రజాతో పాటు మరో ఇద్దరు అనుమానితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. పరువు కోసం పాకిస్తాన్‌లో ప్రతీ ఏడాది 1000 మందికి పై మహిళల హత్యలు జరుగుతున్నాయని అంచనా.

Exit mobile version