Site icon NTV Telugu

Operation Octopus: 16 రాష్ట్రాల్లో తెలంగాణ పోలీసుల గర్జన.. 100 మందికి పైగా సైబర్ కేటుగాళ్లు అరెస్ట్!

Operation Octopus

Operation Octopus

Operation Octopus: తెలంగాణ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు భారీ ఆపరేషన్‌ నిర్వహించారు. ఏకకాలంలో 16 రాష్ట్రాల్లో సోదాలు జరిపి అతిపెద్ద సైబర్‌ క్రైమ్‌ ముఠాను పట్టుకున్నారు. ఆపరేషన్‌ ఆక్టోపస్‌ పేరుతో నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో వంద మందికి పైగా సైబర్‌ నేరగాళ్లను పట్టుకున్నారు. ఇందులో మ్యూల్‌ అకౌంట్‌ హాల్డర్లు, బ్యాంక్‌ అధికారులు, అకౌంట్‌ సప్లయర్స్‌, సైబర్‌ నేరగాళ్లు ఉన్నారు. ఇందులో కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్‌ ఫొటోలతో నేరాలకు పాల్పడుతున్న ముఠా, డిజిటల్‌ అరెస్ట్‌లతో పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠాలున్నాయి. వంద మందికి పైగా నేరగాళ్లను అరెస్ట్‌ చేశారు. వందలాది బ్యాంక్‌ అకౌంట్లు, ల్యాప్‌టాప్‌లు, క్రెడిట్‌ కార్డ్స్‌, డెబిట్‌ కార్డ్స్‌, వందలాది సిమ్‌కార్డులు స్వాధీనం చేసుకున్నారు. పెద్ద మొత్తంలో నగదు సీజ్‌ చేశారు.

READ ALSO: Family Su*cide: ఆర్థిక భారమే కారణమా? భయంతో ముగ్గురు సూసైడ్‌కు పాల్పడ్డారా?

ఇటీవల డిజిటల్‌ అరెస్ట్‌ల పేరుతో మోసాలు, సెలబ్రిటీలు, ప్రముఖుల ఫొటోలు, వీడియోలతో నేరాలకు పాల్పడుతున్న కేసులు అధికం అవడంతో హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు అలర్ట్‌ అయ్యారు. ఇతర రాష్ట్రాల్లో ఉంటూ నెట్‌వర్క్‌ ఆపరేట్‌ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు పోలీసులు. ముఖ్యంగా మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్‌, వెస్ట్‌బెంగాల్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌, హర్యాణా, పంజాబ్‌, ఆంధ్రప్రదేశ్‌, అస్సాం, మధ్యప్రదేశ్‌, బీహార్‌, ఉత్తరాఖండ్‌, ఒడిశా రాష్ట్రాలను గుర్తించారు. ఈ రాష్ట్రాల్లో ఉన్న సైబర్‌ నేరగాళ్లను పట్టుకునేందుకు 32 ప్రత్యేక టీమ్స్‌ ఏర్పాటు చేసి ఆపరేషన్‌ ఆక్టోపస్‌ నిర్వహించారు.

ఈ రాష్ట్రాల్లో ఉంటూ సైబర్‌ నేరాలకు పాల్పడుతున్న ముఠాలను గుర్తించి ఏకకాలంలో సోదాలు జరిపారు. మొత్తం 16 రాష్ట్రాలకు చెందిన 104 మంది సైబర్‌ నేరగాళ్లను అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠాలు ఇప్పటివరకు 1055 సైబర్‌ నేరాలు చేసినట్లు ఆధారాలు సేకరించారు. ఈ ముఠాల నుంచి 204 మొబైల్‌ ఫోన్లు, 141 సిమ్‌ కార్డ్స్‌, 152 బ్యాంక్‌ పాస్‌బుక్స్‌, 234 క్రెడిట్‌, డెబిట్‌ కార్డులు, 26 ల్యాప్‌టాప్‌లు, 56 కార్పొరేట్‌ స్టాంప్స్‌ స్వాధీనం చేసుకున్నారు. 36 లక్షల నగదును సీజ్‌ చేశారు. డిజిటల్‌ అరెస్ట్‌లకు పాల్పడుతున్న నేరగాళ్లతో పాటు.. కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్‌ వీడియోలతో మోసాలకు పాల్పడుతున్న సైబర్‌ నేరగాళ్లు ఉన్నట్లు చెబుతున్నారు హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు. ఈ సైబర్‌ నేరగాళ్లకు పలు బ్యాంక్‌లకు చెందిన అధికారులు సహకరిస్తున్నట్లు గుర్తించి వాళ్లను కూడా అదుపులోకి తీసుకున్నారు. సైబర్‌ నేరగాళ్లకు మ్యూల్‌ అకౌంట్స్‌ సప్లై చేస్తున్న వ్యక్తులను కూడా గుర్తించారు పోలీసులు.

READ ALSO: Marriage Frauds : హైదరాబాద్‌లో బయటపడ్డ షాదీ డాట్ కామ్ మోసగాడు, కిలేడీ పాస్టర్ లీలలు!

Exit mobile version