Site icon NTV Telugu

Special Story: త‌ల్లికి న‌చ్చ‌ని కూతురి ల‌వ‌ర్‌.. 25 ఏండ్లు బందీ చేసి..

Harassment

Harassment

ప్రేమ అనేది రెండు అక్ష‌రాలు. కానీ ఈ ప్రేమ‌లో అనేక చ‌రిత్ర‌లు ఉన్నాయి. ఈ ప్రేమ కోసం ఎంద‌రో ప్రాణాలు త్యాగం చేశారు. మ‌రొకొంద‌రైతే ప్రాణాలు తీశారు. ఇంకొంద‌రి ప్రేమలు మధ్యలోనే మసకబారిపోయాయి. దానికి కారణం వారి కుటుంబ సభ్యులె. పిల్లల ప్రేమను తల్లిదండ్రులు ఎవరైనా సరే చాలావరకు అంగీకరించరు. ఒకవేళ అంగీకారం తెలిపిన ఎన్నో అడ్డంకులు, ఆటుపోట్లు ఎదురవుతూ ఉంటాయి. వీటన్నిటిని దాటితే ఆ ప్రేమ పెళ్లి వరకు వెళుతుంది. లేదంటే మధ్యలోనే మసకబారిపోతుంది. ప్రస్తుత సమాజంలో తల్లిదండ్రులు వారి ప్రేమను అంగీకరించక పోవడం వల్ల చాలామంది ఆత్మహత్యలు చేసుకున్న ఉదంతాలు ఉన్నాయి. అయితే ప్రేమించిన పాపానికి ఓ యువతిని 25 సంవత్సరాలు గదిలో బంధించి చిత్రహింసలు పెట్టింది ఓ తల్లి. ఈ విషాద ఘటన ఏమిటో తెలుసుకుందామా..?

ప్రేమల్లో వారి కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంవల్ల చాలామంది ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అందులోనూ ఆడపిల్లల విషయంలో అయితే మరి ఎక్కువగా నిబంధనలు పెట్టి ఉంచుతారు. అయితే ఆ యువతి ఒక వ్యక్తిని ప్రేమించినందుకు 25 సంవత్సరాలు తను ఒక రూములో బందీగా చేసింది ఆమె తల్లి. ఇది మానవ చరిత్రలోనే చాలా విషాదకరమైన ఘటనలో ఒకటిగా చెప్పవచ్చు. ఈ ఘటన గురించి వింటే నే కన్నీరు వస్తుంది. అయితే ఈ సంఘటన ఇప్పుడు జరిగింది అయితే కాదు. 19వ శతాబ్దంలో ఫ్రాన్సు దేశంలో జరిగినది..

వివరాల్లోకి వెళితే 1876 లో ఫ్రాన్సు దేశంలో ప్లాన్ బ్లాంచే నియర్ అనే యువతి ఒక యువకుని ప్రేమించింది. అప్పుడు ఆమె వయసు 25 ఏళ్లు. ఆమె ప్రేమించిన టువంటి వ్యక్తి ఆమె తల్లికి నచ్చలేదు. దీంతో తన కూతురు ప్రేమను అంగీకరించలేదు. అంతే కాకుండా మరొక వ్యక్తితో ఆమెను వివాహం చేయాలనుకుంది. దీంతో సదరు యువతి నిరాకరించింది. తనకు ప్రేమించిన వ్యక్తి కావాలని తెగేసి చెప్పింది. దీంతో ఆగ్రహానికి గురైనటువంటి ఆ తల్లి తన కొడుకు సహాయముతో ఆ యువతిని చీకటి గదిలో బందీ చేసింది. గొలుసులతో కట్టింది. ఆమె చేసిన చిత్రహింసలు తట్టుకోలేక ఆ యువతి ప్రతిరోజు రోదించేది.

ఆ శబ్దాలను విన్నటువంటి బయటి వ్యక్తులు ఆమె తల్లిని ఆరా తీయగా తన కూతురుకు పిచ్చి లేసిందని చెప్పేది. దీంతో బ్లాంచే 50 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఆ చీకటి గదిలో బందీగా ఉంది. ఆ యువతికి వారి ఇంట్లో ఒక పని వ్యక్తి ప్రతిరోజు ఆహారాన్ని అందించేవాడు. ఆమెను గొలుసుతో కట్టి పడేయడం వలన ఆయువతి మలమూత్ర విసర్జన కూడా అక్కడే చేసేది. దీంతో ఎంతో దౌర్భాగ్యమైన జీవితాన్ని ఆయువతి అనుభవించింది.

చివరికి ఈ విషయం బయటకు రావడంతో పోలీసులు ఆమె ఇంటిపై దాడి చేశారు. ఆ యువతిని చూసి నిర్ఘంతపోయారు. చూడని పరిస్థితి, మాటలు రావడంలేదు, నడవడం లేదు. గది అంతా దుర్వాసన. లోపలికి వెళ్లడానికే పోలీసులు భయం వేసింది. గది అంతా పురుగులతో నిండిపోయి వుంది. పోలీసులు ఆయువతిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఆమె తల్లిని, సోదరుని అరెస్టు చేశారు. ఈ దారుణమైన సంఘటన ప్రపంచం మొత్తం చర్చనీయాంశంగా మారింది. దీంతో సదరు తల్లిని ప్రపంచమంతా అసహ్యించుకుంటుంది. తర్వాత సదరు యువతి 12 ఏళ్ళు బతికి మరణించింది.

Agnipath Protests: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అల్లర్లపై నిజనిర్ధారణ కమిటీ

Exit mobile version