Odisha: ఒడిశా బాలాసోర్ జిల్లాలో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఫకీర్ మోహన్ యూనివర్సిటీలో అసిస్టెంబ్ ప్రొఫెసర్ భార్యపై అత్యాచారయత్నం జరిగింది. అత్యాచారానికి ప్రయత్నించిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. క్యాంపస్‌లోని ప్రొఫెసర్ అధికారిక నివాసంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.
Read Also: Conversion racket: “హిందూ బాలికల”కు వల.. 2050 నాటికి భారత్‌లో ఇస్లాం వ్యాప్తి చేయడమే లక్ష్యం..
శనివారం మధ్యాహ్నం ఎల్‌పీజీ సిలిండర్ మెకానిక్‌గా నటిస్తూ, ఓ వ్యక్తి ప్రొఫెసర్ నివాసంలోకి ప్రవేశించాడు. నిందితుడు డోర్‌బెల్ మోగించగా, బాధిత మహిళ తలుపు తెరిచింది. ఇంట్లోని వంటగదిలోకి సిలిండర్‌ని తనిఖీ చేస్తు్న్నట్లు నటిస్తూ, తలుపులను లాక్ చేశాడు. మహిళ చేయి పట్టుకోవడానికి ప్రయత్నించాడు. అయితే, మహిళ తప్పించుకుని వేరే గదిలోకి వెళ్లి, తన భర్తకు ఫోన్ చేసి సాయం కోసం కేకలు వేసింది. కాలనీ గేట్ల వద్ద ఉన్న భద్రతా సిబ్బంది, ఇంటికి చేరుకుని నిందితుడిని పట్టుకున్నారు.
మహిళ భర్త రెమునా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితుడిని బాలాసోర్ జిల్లాలోని నీలగిరి ప్రాంతా నివాసి శంకర్ పాత్రగా గుర్తించారు. ఈ సంఘటన ఫకీర్ మోహన్ యూనివర్సిటీలో ఉద్రిక్తతతకు దారి తీసింది. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు.
