Site icon NTV Telugu

Bride Kidnapped: ఎంతకు తెగించాడు.. వధువు కిడ్నాప్, నడిరోడ్డుపై వరుడు..

Odisha

Odisha

Bride Kidnapped: ఒడిశాలోని బోలంగీర్ జిల్లాలో షాకింగ్ సంఘటన జరిగింది. కొత్తగా పెళ్లయిన వధువు, తన భర్తతో కలిసి అత్తారింటిక వెళ్తుంటే, తలకు గన్ గురి పెట్టి ఆమెను కిడ్నాప్ చేశారు. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తి వధువు మాజీ ప్రేమికుడిగా తేలింది. బోలంగీర్ జిల్లా నివాసి, వరుడు హరిబంధు పటేల్‌ వివాహం కోసం కాంటమల్‌కు వెళ్లాడు. వివాహం ముగిసిన తర్వాత, వధూవరులు కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలోనే వీరి వాహణాన్ని తర్భా రోడ్డులోని బదబంధ వద్ద అడ్డగించారు.

Read Also: Maa Inti Bangaram: థియేటర్లలో సమంత రచ్చ అప్పుడే! ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ డేట్ వచ్చేసింది..

వధువు ఎక్స్-లవర్ మరో ఇద్దరు నిందితులతో కలిసి తుపాకీ చూపి బెదిరించి, వధువులను బలవంతంగా కిడ్నాప్ చేశారు. వరుడు, అతడి కుటుంబ సభ్యులు నిస్సహాయంగా నడిరోడ్డుపూ చూస్తుండిపోయారు. ఈ సంఘటన తర్వాత వరుడు తర్భా పోలీస్ స్టేషన్‌లో తన భార్యను కిడ్నాప్ చేసినట్లు ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించి, వధువును వెతికే పనిచేస్తున్నారు. నిందితుడిని పట్టుకునేందుకు స్పెషల్ టీమ్‌లను ఏర్పాటు చేశారు.

Exit mobile version