NTV Telugu Site icon

Rajasthan: రాజస్థాన్‌లో దారుణం.. ఐసీయూలో ఉన్న మహిళకు ఇంజెక్షన్ ఇచ్చి అత్యాచారం..

Icu

Icu

Rajasthan: రాజస్థాన్‌లో దారుణం జరిగింది. పేషెంట్‌ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన నర్సింగ్ స్టాఫ్ మహిళపై అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ ఘటన అల్వార్ జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. ఐసీయూలో చేరిన 24 ఏళ్ల యువతిపై నర్సింగ్ అసిస్టెంట్ అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఉపిరితిత్తలు ఇన్ఫెక్షన్ కారణంగా సదరు యువతి ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడు చిరాగ్ యాదవ్ తెల్లవారుజామున 4 గంటలకు ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు తెలిపారు.

Read Also: Varun Tej: చరణ్ అన్నకు నాకు మధ్య గొడవ.. కళ్యాణ్ బాబాయ్ అయితే నన్ను రూమ్ లో పెట్టి

తనకు మత్తుమందు ఇచ్చి స్పృహ కోల్పోయేలా చేశాడని యువతి ఆరోపించినట్లు పోలీస్ అధికారి తెలిపారు. యువతి మొబైల్‌కి ఆమె భర్త కాల్ చేయడంతో స్పృహలోకి వచ్చిందని, ఆ తర్వాత ఆమెపై జరిగిన అఘాయిత్యాన్ని కుటుంబ సభ్యులకు వివరించిందని పోలీసులు చెప్పారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని, అతను బెడ్ పైకి వెళ్లి, అడ్డుగా కర్టెన్లు కప్పి ఉన్న సీసీటీవీ ఫుటేజీని కూడా పరిశీలిస్తున్నామని వెల్లడించారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారిస్తు్న్నామన్నారు.

Show comments