Suspicious Death: పశ్చిమ బెంగాల్ రాష్ట్రం హూగ్లీ జిల్లా సింగూర్‌లోని ఒక ప్రైవేట్ నర్సింగ్ హోంలో పనిచేస్తున్న నర్సు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందింది. ఈ ఘటన గురువారం చోటుచేసుకోగా, శుక్రవారం పోలీసులు వివరాలు వెల్లడించారు. పోలీసుల సమాచారం ప్రకారం.. 24 ఏళ్ల నర్సు శవం నర్సింగ్ హోం మూడో అంతస్తులోని గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకున్న స్థితిలో కనపడిందని తేలింది. ఈ నర్సు పూర్వ మేదినీపూర్ జిల్లా నందిగ్రామ్‌కు చెందినవారని, కేవలం నాలుగు రోజుల క్రితమే ఈ నర్సింగ్ హోంలో పనిచేయడం ప్రారంభించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
Moinabad News: నేను జాతీయ జెండా ఎగురవేయను.. కమిషనర్ ఖాజా మొండిపట్టు..
ఈ ఘటన నేపథ్యంలో మృతురాలి కుటుంబం తీవ్ర ఆరోపణలు చేస్తుంది. చనిపోయిన నర్సు నర్సింగ్ హోంలో జరుగుతున్న అక్రమాలను బహిర్గతం చేయడంతో, ఆమెపై లైంగిక దాడి చేసి హత్య చేసినట్లు పేర్కొంది. అయితే నర్సింగ్ హోం యాజమాన్యం ఈ ఆరోపణలను ఖండిస్తూ, ఇది ఆత్మహత్య పేర్కొంది. దీనితో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరణానికి గల కారణంపై స్పష్టత రావడానికి పోస్ట్‌మార్టం నివేదిక కోసం ఎదురుచూస్తున్నారు. ఆ తరువాత తగిన చర్యలు తీసుకుంటాం అని అక్కడి పోలీస్ అధికారి తెలిపారు.
Coolie : అఫీషియల్.. కూలీ డే 1 కలక్షన్స్.. రికార్డ్స్ బద్దలు కొట్టిన రజనీ
ఈ ఘటనపై ప్రతిపక్ష బీజేపీ, సీపీఐ(ఎం) నేతలు సింగూర్‌లో ఆందోళనలు నిర్వహిస్తూ, ఇది స్పష్టమైన హత్య అని ఆరోపించారు. రాష్ట్ర మంత్రి, స్థానిక టీఎంసీ ఎమ్మెల్యే బేచారం మన్నా మాట్లాడుతూ, “దర్యాప్తులో ఏవైనా అనుమానాస్పద అంశాలు బయటపడితే, కఠిన చర్యలు తప్పవు” అని హామీ ఇచ్చారు.
