NTV Telugu Site icon

Crime: స్నానం చేస్తుండగా ఫొటోలు, వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్.. నిందితుడికి 20ఏళ్ల జైలు శిక్ష

Crime

Crime

రాజస్థాన్‌లోని జుంజునులో 17ఏళ్ల మైనర్ బాలికపై ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. మైనర్ బాలిక స్నానం చేస్తుండగా నిందితుడు వీడియోలు, ఫొటోలు తీసిన తీశాడు. ఆ తర్వాత ఆమెను బ్లాక్‌మెయిల్ చేస్తూ అత్యాచారం చేశాడు. ఇప్పుడు లైంగిక వేధింపులకు పాల్పడిన నిందితుడికి కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.50,000 జరిమానా విధించింది. ఈ సంఘటన మూడున్నరేళ్ల క్రితం డిసెంబర్ 2020లో చోటుచేసుకుంది. ఈ ఘటనలో నిందితుడు సాహిరామ్ మైనర్ బాలిక ఇంట్లోకి ప్రవేశించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే నగ్నంగా స్నానం చేస్తున్న ఫొటోలు, వీడియోలను వైరల్ చేస్తానని బెదిరించాడు. ఈ భయంతో బాలిక మౌనంగా ఉండడంతో నిందితుడు పలుమార్లు అత్యాచారం చేశాడు.

READ MORE: Jani Master Wife: నా భర్త ఎలాంటి తప్పు చేయలేదు.. అంతా కుట్ర!

ఈ కేసు జుంజునులోని గుధగౌడ్జి పోలీస్ స్టేషన్‌లో నమోదైంది. నిందితుడు సహిరామ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు అతనిపై పోక్సో చట్టం, ఎస్సీ/ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేశారు. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఓంప్రకాష్ సైనీ వివరణ ప్రకారం.. కుటుంబ సభ్యులు పెళ్లికి వెళ్లగా.. నిందితుడు ఇంట్లోకి ప్రవేశించి 17 ఏళ్ల బాలికను బలవంతంగా గదిలోకి తీసుకెళ్లాడు. ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత నేను స్నానం చేస్తున్న ఫొటోలు, వీడియోలు తీశానని నిందితుడు బాలికతో చెప్పాడు. అత్యాచారం గురించి ఎవరికైనా చెబితే.. ఈ వీడియోలను వైరల్ చేస్తానని బాలికను బెదిరించాడు. పలు మార్లు బాలికపై అత్యాచారం చేశాడు. ఈ మేరకుగుధగౌడ్జి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. కేసునమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ప్రత్యేక కోర్టులో ఈ కేసు విచారణ జరిగింది.

READ MORE:Monkeypox Case: భారత్‌లో మరో మంకీపాక్స్ కేసు.. ఒకే రాష్ట్రంలో రెండు కేసులు

బాధితురాలి తరపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఓంప్రకాష్ సైనీ హాజరయ్యారు. ప్రాసిక్యూటర్ 11 మంది సాక్షుల వాంగ్మూలాలు, 47 పత్రాలను కోర్టులో సమర్పించారు. సుమారు మూడు సంవత్సరాల తొమ్మిది నెలల పాటు సాగిన విచారణ తర్వాత, పోక్సో కోర్టు నిందితుడు సహిరామ్‌కు పోక్సో చట్టం కింద 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ. 50,000 జరిమానా విధించింది. దీంతో పాటు ఎస్సీ/ఎస్టీ చట్టంలోని సెక్షన్ల కింద 5 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ. 20 వేల జరిమానాతో పాటు ఏడాది జైలుశిక్ష, రూ.10 వేల జరిమానా కూడా విధించారు.

Show comments