Site icon NTV Telugu

ఫేస్ బుక్ ప్రేమ… 38 లక్షలు కాజేసిన కేటుగాళ్ళు

సైబర్ చీటర్ నైజీరియన్ ను అరెస్ట్ చేసారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఫేస్ బుక్ లో నకిలీ పేర్లతో పరిచయం, ఆపై ప్రేమ , పెళ్లి అని ఓ యువతిని నమ్మించిన నైజీరియన్… తను యూకే లో డాక్టర్ అని చెప్పాడు. యూకే నుండి 40 వేల ఫౌండ్ల నగదు పార్సిల్ పంపిస్తున్నానని చెప్పిన చీటర్… ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుండి కస్టమ్ అధికారుల పేరుతో ఫోన్ కాల్ చేసాడు. ఆ పార్సిల్ ఇవ్వాలంటే పార్సల్, ఐటి, మనీలాండరింగ్ ఇతర చార్జీల పేరుతో విడతలవారిగా 38 లక్షల రూపాయలు కాజేశారు కేటుగాళ్ళు.

అనంతరం పార్సల్ రాకపోవడంతో మోసపోయానని హైదరాబాద్ ఈస్ట్ మారేడుపల్లికి చెందిన మహిళ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసిన పోలీసులు.. ఢిల్లీలో ఉన్న నైజీరియన్ ఒనేకా సోలమన్ విజ్డమ్ ను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. ఈ నైజీరియన్ నుండి 7 మొబైల్ ఫోన్లు, రెండు బ్యాంక్ పాస్ బుక్స్, ఒక డెబిట్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.

Exit mobile version