సృష్టిలో స్త్రీ, పురుషుల బంధం చాలా ప్రత్యేకమైంది. పెళ్లి అనే రెండు అక్షరాలతో అమ్మాయి-అబ్బాయి వైవాహిక బంధంలోకి అడుగుపెడతారు. నాటి నుంచి ఒక కుటుంబంగా ఏర్పడతారు. భారతీయ సంస్కృతిలో దీనికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. అలాంటిది ఈ మధ్య జంటలు.. వివాహ బంధానికి తూట్లు పొడుస్తున్నారు. కలకాలం తోడుంటామని ప్రమాణం చేసిన వాళ్లే… అర్ధాంతరంగా భాగస్వాములను కాటికి పంపిస్తున్నారు. ఇదంతా ఎందుకుంటారా? అగ్ని సాక్షిగా ఏడడుగులు వేసిన భర్తనే పైకి పంపాలనుకుంది ఓ నవ వధువు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: Sonakshi Sinha : ఇండియాలో మాత్రం చచ్చినా బికినీ వేసుకోను..
కడలూరు జిల్లా కరువెపంపట్టికి చెందిన కలైయారసన్ అనే 27 ఏళ్ల యువకుడికి ఓ యువతితో జనవరి 27, 2025న పెళ్లైంది. అదే రోజు నవ దంపతులకు శోభనం ఏర్పాటు చేశారు. ఎన్నో కలలతో.. ఎన్నో ఊహలతో వరుడు శోభనం గదిలోకి అడుగుపెట్టాడు. ఏదేదో.. ఊహించుకుని భార్య దగ్గరకు వెళ్తే.. మైండ్ బ్లాక్ అయ్యే షాకిచ్చింది. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని.. ప్రియుడితోనే జీవిస్తానని తెగేసి చెప్పింది. అంతేకాదు.. భర్త ముందే వీడియో కాల్ చేసి ప్రియుడితో మాట్లాడింది. ఒక్కసారిగా వరుడు నిశ్చేష్టుడయ్యాడు. దీంతో శోభనాన్ని క్యాన్సిల్ చేసుకున్నాడు.
అత్తింటిలో ఉంటూనే ఆమె రోజు ప్రియుడికి ఫోన్ చేస్తూ మాట్లాడుతుంది. విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులకు కలైయారసన్ తెలియజేశాడు. అంతేకాకుండా ఫిబ్రవరి 12న భార్యను తీసుకుని ఆమె ఇంటికి వెళ్లాడు. అక్కడ ఏం జరిగిందో ఏమో తెలియదు గానీ.. తిరిగి భార్యను తీసుకుని తన ఇంటికి వచ్చాడు. అమ్మాయి ఇంటి నుంచి కొందరు బంధువులు కలైయారసన్ ఇంటి మీదకి గొడవకొచ్చారు. ఆమెతోనే కాపురం చేయాలని అర్ధరాత్రి 12 గంటల సమయంలో కలైయారసన్‌ను ఇంట్లో కట్టేసి కొట్టి వార్నింగ్ ఇచ్చి వెళ్లారు.
ఇది కూడా చదవండి: RACE : రేస్ 4లోకి ఎంట్రీ ఇస్తోన్న మాజీ టాలీవుడ్ బ్యూటీ.?
ఈ సంఘటన జరిగిన మూడు రోజుల తర్వాత యథావిధిగా కలైయారసన్.. పనుల కోసం బయటకు వెళ్లాడు. ఇంటికి రాగానే భార్యను టీ తీసుకుని రావాలని కోరాడు. కానీ ఆమె జ్యూస్ తీసుకొచ్చింది. ప్రేమతో తెచ్చిందేమో అనుకుని తాగేశాడు. కానీ కొద్దిసేపటికే అతడు అస్వస్థతకు గురయ్యాడు. జ్యూస్‌లో విషం కలిపినట్లు చెప్పడంతో అతడు షాక్ అయ్యాడు. కుటుంబ సభ్యులు హుటాహుటినా పుదుచ్చేరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు వధువుపై బాధితుడి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఎమర్జెన్సీ వార్డులో కలైయారసన్ చికిత్స పొందుతున్నాడు.
ఇది కూడా చదవండి: Venkaiah Naidu : హీరోల పాత్రల తీరుపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంచలన వ్యాఖ్యలు