Site icon NTV Telugu

Nepal Gang: భార్యభర్తలం అంటూ నాటకం.. పని మనుషులుగా చేరి భారీగా చోరీలు..!

Nepal

Nepal

Nepal Gang: హైదరాబాద్‌లో సంపన్నుల ఇళ్లను టార్గెట్ చేసుకుని దోపిడీ చేస్తున్న నేపాలీ గ్యాంగ్ ఆట కట్టించారు పోలీసులు. ఇటీవల జూబ్లీహిల్స్‌లోని ఓ ఇంట్లో పని మనుషుల్లా నటించి.. ఆ ఇంటికే స్కెచ్ వేసి దాదాపు 2 కోట్ల రూపాయలకు పైగా సొత్తు దోచుకు వెళ్లిన గ్యాంగ్‌‌ను పట్టుకున్నారు. ఇంతకీ ఆ కంత్రీ గ్యాంగ్ ఎక్కడ దొరికింది? పోలీసులు చోరీ సొత్తును మొత్తం రికవరీ చేశారా..? వారి పేర్లు మహేష్ షాహీ, అప్సర. నిజానికి ఇద్దరికీ సంబంధం లేదు. కానీ.. నేపాల్ నుంచి హైదరాబాద్‌లో అడుగు పెట్టిన ఈ జంట.. చోరీలకు స్కెచ్చేశారు. అందుకోసం తాము భార్యభర్తలం అంటూ నాటకం మొదలు పెట్టారు. సంపన్నుల ఇళ్లను టార్గెట్ చేశారు. అక్కడ పని మనుషులుగా చేరేందుకు ప్రయత్నించారు. చివరకు జూబ్లీహిల్స్ రోడ్‌ నెం 25లోని ఓబుల్‌రెడ్డి స్కూల్‌ సమీపంలోని ప్లాట్‌ నెంబర్‌ 305లో పింగళి అనిరుధ్‌రెడ్డి, దీపికారెడ్డి దంపతుల ఇంట్లో వారికి ఉద్యోగం దొరికింది.

Land Registrations: కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ రిజిస్ట్రేషన్ల శాఖ.. పని వేళలు పొడిగింపు..

ఇక అక్కడి నుంచి తమ స్కెచ్ అమలు చేసేందుకు ఎదురు చూశారు మహేష్ అండ్ అప్సర. ఇంటి యజమానులు ఎప్పుడెప్పుడు బయటకు వెళ్తుంటారు? ఎప్పుడు తిరిగి వస్తుంటారు? ఇలా ఈ విషయాలపై రెక్కీ నిర్వహించారు. మరోవైపు అనిరుధ్ రెడ్డి, దీపికా రెడ్డి దంపతులు ఊటీ, కూర్గ్‌ తదితర ప్రాంతాల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తుంటారు. ఈ క్రమంలో మార్చి 5న వారిద్దరూ ఇంటికి తాళం వేసి వ్యాపారం పనిమీద ఊటీ వెళ్లారు. ఆ ఇంట్లో 45రోజుల క్రితం భార్యాభర్తమంటూ తోటమాలీగా పనిలో చేరిన మహేష్‌ షాహీ అలియాస్‌ ప్రకాష్‌, అప్సర అలియాస్‌ మాయ.. మరో ముగ్గురు నేపాలీ గ్యాంగ్‌ సభ్యుల సహకారంతో మార్చి 13న అర్ధరాత్రి తర్వాత కట్టర్స్‌, రాడ్స్‌తో ఇంట్లోకి ప్రవేశించారు. బెడ్‌రూమ్‌లోని అల్మారాలను పగలగొట్టి సుమారు రూ.2కోట్ల విలువైన డైమండ్‌ నెక్లెస్‌లు, రాడో వాచ్‌లు, బంగారు, వెండి ఆభరణాలు దొంగిలించారు.

Earthquake: జపాన్‌లో భారీ భూకంపం.. 6.2 తీవ్రత నమోదు

ఈ ఘటనలో నిందితులను పట్టుకునేందుకు జూబ్లీహిల్స్‌ క్రైం పోలీసులతో పాటు టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల ప్రత్యేక బృందాలు దేశంలోని పలు నగరాలతో పాటు నేపాల్‌ సరిహద్దుల్లో మొహరించారు. కాగా చోరీ సొత్తును తలా కొంత పంచుకున్న నిందితులు ఢిల్లీతో పాటు ఇతర నగరాలకు పారిపోయారు. మహేష్‌ షాహీ, అప్పర పోలీసుల కళ్లుగప్పి సరిహద్దు దాటారు. దాదాపు 10 రోజులు వారికోసం కాపుకాసిన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు నేపాల్‌ వెళ్లి నిందితులను పట్టుకున్నారు. స్థానిక కోర్టులో వారిని హాజరుపర్చిన అనంతరం విచారించగా చోరీ సొత్తులో కొంతభాగం తీసుకుని నరేష్‌ అనే వ్యక్తి ఢిల్లీకి వెళ్లాడని తేలడంతో అతడిని సైతం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మహేష్‌ షాహీ, అప్సర ఇద్దరూ సహజీవనం చేస్తున్నారని.. చోరీ స్కెచ్‌లో భాగంగా భార్యాభర్తలుగా సంపన్నుల ఇంట్లో ప్రవేశిస్తుంటారని పోలీసుల విచారణలో తేలింది. కాగా చోరీలో పాల్గొన్న మరో ఇద్దరు నిందితుల కోసం పోలీసుల వేట కొనసాగుతోందని తెలుస్తోంది. చోరీ అయిన సొత్తులో కొంత రికవరీ అయినప్పటికీ ఎక్కువ సొత్తు ఇంకా లభ్యం కాకపోవడంతో నిందితులను పట్టుకునేందుకు పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

Exit mobile version