Site icon NTV Telugu

Nellore Lady Don Arrest: రౌడీషీటర్‌ శ్రీకాంత్‌ ప్రియురాలు.. నెల్లూరు లేడీ డాన్‌ అరెస్ట్..

Nellore Lady Don Arrest

Nellore Lady Don Arrest

Nellore Lady Don Arrest: రౌడీషీటర్‌ శ్రీకాంత్‌ ప్రియురాలు.. అతడికి పెరోల్‌ వ్యవహారంలో కీలక పాత్ర పోషించడమే కాదు.. అతడి సహకారంతో నేరాలకు పాల్పడుతోందనే ఫిర్యాదులతో రౌడీషీటర్‌ శ్రీకాంత్‌ ప్రియురాలు అరుణను కోవూరు పోలీసులు అరెస్ట్‌ చేశారు. లేడీ డాన్‌, కిలాడీ లేడీ నిండిగుంట అరుణపై కేసులు నమోదు చేశారు.. అరుణపై CR No: 246/2025 U/sec 127(2), 140(3), 308(5), 115(2) r/w 3(5) BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసుల.. అరుణతో పాటు మరో ముగ్గురిని ముద్దాయిలుగా చేర్చారు.. ఏ 1-నిడిగుంట అరుణ, ఏ 2- పల్లం వేణు, ఏ 3- అంకెం రాజ, ఏ 4- సీరం ఎలిష.. ఇలా నలుగురిని ఈ కేసులో ముద్దాయిలుగా పేర్కొన్నారు పోలీసులు.. మునగ వెంకట మురళి కృష్ణమోహన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.. అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌ అద్దెకు తీసుకొని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయమని మురళీ కృష్ణను కత్తితో బెదిరించినట్టు ఫిర్యాదు అందడంతో.. అరుణను అరెస్ట్‌ చేసిన పోలీసుల.. వైద్య పరీక్షలు నిర్వహించి నెల్లూరు కోర్టుకు తరలించారు.

Read Also: Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ మరో కానుక.. 10 వేల మంది పిఠాపురం ఆడపడుచుల కోసం..!

మరోవైపు, రౌడీ షీటర్ శ్రీకాంత్ ప్రేయసి అరుణపై దృష్టి పెట్టారు నెల్లూరు జిల్లా పోలీసులు.. ఓ బిల్డర్ ని బెదిరించిన కేసులో అరుణతోపాటు మరో ముగ్గురు పై కేసు నమోదు చేసి.. విజయవాడ వెళ్తుండగా అద్దంకి సమీపంలో అరుణని అరెస్టు చేశారు కోవూరు పోలీసులు.. అరుణ ఆగడాలు మితిమీరిపోయాయంటూ.. ఆమెపై చర్యలు తీసుకోవాలని కోవూరు పోలీసులను ఆశ్రయించారు లాయర్ రాజారావు.. గతంలో అనేక ఫిర్యాదులు చేసినా.. పోలీసులు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెలుగులో చిరు ఉద్యోగిగా కెరీర్‌ ప్రారంభించి.. దిశ ప్రొటెక్షన్ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా వెలుగులోకి వచ్చిన అరుణ.. పోలీసులతో విస్తృతంగా పరిచయాలు పెంచుకుంది.. స్టేషన్లలో సెటిల్‌మెంట్లు చేస్తుందనే ఆరోపణలు అరుణపై ఉన్నాయి.. ఇక, జిల్లా సెంట్రల్ జైల్లో ఉన్న రౌడీషీటర్‌ శ్రీకాంత్ కి పెరోల్ ఇప్పించడంలో అరుణది కీలక పాత్రగా చెబుతున్నారు..

Read Also: Film Workers Strike: సినీ కార్మికుల సమ్మెపై ముఖ్యమంత్రి కీలక నిర్ణయం..!

ఇక, అరుణ వ్యవహారం వెలుగులోకి రావడంతో.. ఒక్కొక్కరుగా బయటికి వస్తున్నారు అరుణ బాధితులు.. దాడులు దౌర్జన్యాలను ప్రశ్నించినందుకు అరుణ తనపై కక్ష కట్టిందని లాయర్ రాజారావు పేర్కొన్నారు.. అరుణ OC అయితే.. SC అని చెప్పుకుంటూ అందరిని బెదిరిస్తుందంటున్నారు.. ఇంటి ఓనర్‌న బెదిరించి ఫ్లాట్‌ను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అరుణ ప్రయత్నించింది.. అరుణ చేస్తున్న అరాచకాలను జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లకు నోటీసుల రూపంలో పంపాను.. అరుణను కఠినంగా శిక్షించి బాధితులకు న్యాయం చేయాలి అంటున్నారు లాయర్‌ రాజారావు..

Exit mobile version