Navi Mumbai: ఇటీవల కాలంలో భర్తల్ని భార్యలు చంపుతున్నారు. తమ ప్రియులతో కలిసి ప్లాన్ చేసిన హతమారుస్తున్నారు. అయితే, ఇలాంటి సంఘటన నడుమ నవీ ముంబైలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. వివాహిత మహిళలపై మోజు పెంచుకున్న ఒక వ్యక్తి, ప్రేమను తిరస్కరించడంతో ఆమె భర్తను దారుణంగా హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.
ఫాలిమా మండల్(25), అబూబకర్ సుహ్లాది మండల్(35) భార్యభర్తలు. అయితే, నవీ ముంబైలోని వాషి ప్రాంతానికి చెందిన అమీనూర్ అలీ అహ్మద్(21) ఫాతిమాను ప్రేమించాడని, ఆమెను పదేపదే పెళ్లి చేసుకోవాలని కోరినట్లు పోలీసులు తెలిపారు. అయితే, ఫాతిమా ఇందుకు నిరాకరించడంతో అమీనూర్ ఆమె భర్త అబూబకర్‌ని దారుణంగా హత్య చేసినట్లు తేలింది.
Read Also: Harassment: ‘‘మామ కౌగిలించుకున్నాడు’’.. వేధింపులతో కోడలు ఆత్మహత్య..
సోమవారం, అబూబకర్ పనులు ముగించుకుని ఇంటికి తిరిగిరాలేదు. అతడి భార్య ఫాతిమా స్థానిక పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ ఫిర్యాదు నమోదు చేసింది. అదే సమయంలో అమీనూత్ తన వెంట పడి ప్రేమ, పెళ్లి పేరుతో వేధిస్తున్నట్లు చెప్పింది. పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా, అమీనూర్ చేతిలో అబూబకర్ హత్యకు గురైనట్లు తేలింది. ఆధారాలు నాశనం చేయడానికి అమీనూన్ తాను ధరించిన బట్టలు, ఇతర వస్తువులు పన్వేల్-సియోన్ రోడ్డులోని వాషి గ్రామ అండర్ పాస్ సమీపంలోని కాలువలో పారేసినట్లు పోలీసులు తెలిపారు. అమీనూల్ మృతదేహాన్ని బుధవారం ఉదయం వాషి వాగు నుంచి స్వాధీనం చేసుకున్నారు. నిందితుడికి సాయం చేసినట్లు భావిస్తున్న అతడి స్నేహితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
