కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ లో అరెస్ట్ లపై సీరియస్ అయింది జాతీయ బీసీ కమీషన్. ఈ మేరకు కరీంనగర్ సీపీకి నోటీసులు జారీ చేసింది జాతీయ బీసీ కమీషన్. సోషల్ మీడియాలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్ట్ లు పెట్టారని నలుగురిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు పోలీసులు. దీనిపై నిరసన వ్యక్తం అయింది.
ఈ ఘటనపై కమలాపూర్ కి చెందిన కారట్ల దశరథం జాతీయ బీసీ కమీషన్ కి ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన బీసీ కమీషన్ జరిగిన సంఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసు ఉన్నతాధికారులకు హెచ్చరికలు జారీచేసింది. దీనిపై కరీంనగర్ సీపీ ఎలా స్పందిస్తారో చూడాలి.