Site icon NTV Telugu

Nandyala: వివాహ బంధానికి మాయని మచ్చ.. ప్రియుడి మోజులో పడి ఇల్లాలు ఎంత పని చేసిందంటే..!

Husband Murder

Husband Murder

ఏడడుగులు నడిచి జీవితాంతం కలసి జీవిస్తామని కొత్త బంధంతో జీవితాన్ని ప్రారంభించిన వారు కొన్నేళ్లకే భర్తను కడతెరుస్తున్నారు. చక్కని కాపురంలో చిచ్చు రగిలించుకుని.. జీవితాలను జైళ్లపాలు చేసుకుంటున్నారు. అనైతిక బంధాలకు ఆకర్షితులై ప్రియుని మోజులో కట్టుకున్న భర్తనే కడతేరుస్తున్నారు. తాజాగా మరో కిల్లర్ వైఫ్ ఘటన నంద్యాల జిల్లాలో కలకలం రేపుతోంది.

నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం కైప సమీపంలో మార్చి 16న గుర్తుతెలియని మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. మృతదేహం ఆనవాళ్లు పరిశీలించిన తరువాత మృతుడు డోన్‌కు చెందిన విల్సన్‌గా గుర్తించారు పోలీసులు. విల్సన్ హత్యకు గురైన నిర్ధారణకు వచ్చిన పోలీసులకు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

విల్సన్.. పాలిష్ కట్టర్‌గా పని చేస్తున్నారు. సొంతూరు డోన్‌లోని బంగారయ్య కాలనీ. బెంగుళూరు, శిమోగాలో పాలిష్ కట్టర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. 11ఏళ్ల క్రితం నంద్యాల లోని బొగ్గు లైన్‌కు చెందిన మేరీ అలియాస్ రాశి అనే మహిళతో వివాహం విల్సన్‌కు వివాహం జరిగింది. మూడేళ్లుగా విల్సన్‌కు, భార్యకు గొడవలు జరుగుతున్నాయి. దీంతో భార్య మేరీ పుట్టింటికి వెళ్లింది. ఆ తరువాత విల్సన్ కూడా అక్కడికే వెళ్లాడు. భార్య ప్రవర్తనపై అనుమానంతో గొడవలు తీవ్రమయ్యాయి. ఈనేపథ్యంలో విల్సన్ మద్యానికి బానిసయ్యాడు.

విల్సన్ భార్య మేరీకి నంద్యాల మండలం బాపూజీ నగర్‌కు చెందిన సింగారి మధు అలియాస్ శంకర్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి వివాహేతర బంధానికి దారితీసింది. ఒక దశలో ఇద్దరూ వివాహం చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. మేరీకి, విల్సన్ గోడవ జరిగి మేరీని కొట్టేవాడు విల్సన్. 15 రోజుల క్రితం కూడా విల్సన్, మేరీ మధ్య గొడవ జరిగింది. దీంతో విల్సన్ సొంతూరులో డోన్ కి వెళ్లాడు. మేరీ ఈ విషయం తన ప్రియుడు మధుతో షేర్ చేసుకుంది. విల్సన్‌ను అడ్డు తొలగించుకుంటే ఇక ఇద్దరూ స్వేచ్ఛగా జీవించవచ్చని ప్లాన్ చేశారు.

ఇంకేముంది.. ముందస్తు ప్లాన్ ప్రకారం.. విల్సన్‌ను చంపేదుకు మధు తన స్నేహితులు రఫీ, అశోక్‌తో కలసి ప్లాన్ చేశారు. మేరీ, సింగారి మధు, రఫీ, అశోక్ ఆటో తీసుకొని మార్చి 15న డోన్‌కు చేరుకున్నారు. డోన్‌లో విల్సన్‌ను ఆటోలో ఎక్కించుకొని.. తిరిగి వచ్చేటప్పుడు బనగానపల్లె మీదుగా రాయపాడు వచ్చి అక్కడ చంపి కుందూనదిలో పడేయాలని ప్లాన్ చేశారు. మద్యం మత్తులో ఉన్న విల్సన్.. ఆ తరువాత మద్యం మత్తు వీడి తనను ఆటోలో ఎక్కడికి తీసుకువెళ్తున్నారని గొడవ చేశాడు. కైప ఊరి బయట అందరూ కలిసి బెల్ట్ తీసుకొని మెడకు గట్టిగా బిగించి.. రాళ్లతో అతని తలపై కొట్టారు. దీంతో విల్సన్ అక్కడికక్కడే చనిపోయాడు. తరువాత విల్సన్ శవాన్ని ఎవరు గుర్తు పట్టకుండా ఉండడానికి.. కాల్చాలని అక్కడే ఉన్న చెత్త పేపర్‌లు శవం మీద పేపర్లు వేసి నిప్పు పెట్టారు. ఆ తరువాత నిందితులు తమ బట్టలకు రక్తం కావడంతో కుందనదిలో స్నానం చేసి బట్టలు అక్కడే పారేసి వెళ్లిపోయారు.

సీన్ కట్ చేస్తే.. డెడ్‌బాడీని పోలీసులు గుర్తు పట్టడంతో నిందితులు భయపడ్డారు. కైప వీఆర్ఓ సమక్షంలో లొంగిపోయారు. ఈ కేసులో విల్సన్ భార్య మేరీతోపాటు మధు, రఫీ, ఆశోక్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తను కడతేర్చిన మేరీని కఠినంగా శిక్షించాలని విల్సన్ బంధువులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు తల్లి జైలుకు వెళ్లడం.. తండ్రి చనిపోవడంతో వారి ఇద్దరు పిల్లలు అనాథలుగా మిగిలారు.

Exit mobile version