NTV Telugu Site icon

AP Crime: కూతురి ప్రేమ పెళ్లికి సహాయం చేసిన వ్యక్తి హత్యకు కుట్ర..! రంగంలోకి సుపారీ గ్యాంగ్.. ట్విస్ట్‌ ఏటంటే..?

Ap Crime

Ap Crime

AP Crime: ప్రేమించుకున్నవారు పెళ్లి చేసుకోవడానికి ఇంట్లో వాళ్లు ఒప్పుకోకపోతే.. ఫ్రెండ్స్‌, తెలిసినవాళ్లు.. ముందుండి మరీ పెళ్లి చేస్తుంటారు.. కానీ, వారే టార్గెట్‌గా మారిపోయిన సందర్భాల్లో ఎన్నో ఉంటాయి.. తన కూతురు ప్రేమ వివాహానికి సహకరించిన వ్యక్తిని సుపారీ ఇచ్చి మరీ హత్య చేయడానికి ప్లాన్‌ చేశాడో ఓ వ్యక్తి.. కోడి కత్తులతో పొడిచి హత్య చేసేందుకు పక్కా ప్రణాళిక రచించారు.. అయితే, హత్య చేసేందుకు రెక్కి చేస్తుండగా నిందితులను అనుమానం వచ్చి పోలీసులు పట్టుకున్నారు.. ఈ కేసు వివరాలను నందిగామ ఏసీపీ తిలక్ మీడియాకు వెల్లడించారు.

Read Also: Masthan Sai: హీరో నిఖిల్ ఫోన్ హ్యాక్.. హార్డ్ డిస్కులో ప్రయివేటు వీడియోలు?

పూర్తి వివరాల్లోకి వెళ్తే ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం గ్రామానికి చెందిన మువ్వ వీర్రాజును 14 నెలల క్రితం ఏ కొండూరు మండలం కోడూరు గ్రామానికి చెందిన కోలా నరసింహారావు కుమార్తె రమ్యశ్రీ ప్రేమించి వాహనం చేసుకుంది. ఈ ప్రేమ వివాహానికి ప్రేమికుడు వీర్రాజు సమీప బంధువు ఏ కొండూరు మండలం ఖమ్మంపాడు గ్రామంలో విద్యుత్ శాఖలో జూనియర్ లైన్‌మెన్‌గా పనిచేస్తున్న మువ్వ గోపి సహకరించాడు. దీంతో ప్రేమ వివాహానికి సహకరించాడనే కారణంతో మువ్వా గోపిని హత్య చేసేందుకు రమ్యశ్రీ తండ్రి కోలా నరసింహారావు ప్రణాళిక వేశాడు. హత్యకు హైదరాబాద్ కు చెందిన పాలంపల్లి విజయ్ కుమార్ కు లక్ష రూపాయలకు సుఫారీ ఇచ్చారు. సంక్రాంతి పండుగ రోజు మరో ఇద్దరితో కలిసి మొత్తం నలుగురు ఐతవరంలో ఉన్న మొవ్వ గోపిని హత్య చేసేందుకు రెక్కి నిర్వహించారు.

Read Also: Masthan Sai: హీరో నిఖిల్ ఫోన్ హ్యాక్.. హార్డ్ డిస్కులో ప్రయివేటు వీడియోలు?

అయితే, ఆ సమయంలో కుదరపోవటంతో ఫిబ్రవరి 2వ తేదీన ఆదివారం నాడు గోపిని హత్య చేసేందుకు నందిగామ మయూరి టాకీస్ సెంటర్‌లో అనుమానాస్పదంగా తిరుగుతున్నారు.. దీనిపై నందిగామ సీఐకి సమాచారం రావడంతో ఆయన సిబ్బందితో కలిసి నలుగురిని అదుపుకొని అదుపులో తీసుకొని విచారించగా.. హత్య కుట్ర బహిర్గతమైంది. వారి వద్ద నుంచి కోడి కత్తులు స్వాధీనం చేసుకున్నారు. నలుగురిపై కేసు నమోదు చేసి అదుపులో తీసుకున్నారు. నిందితులను కోర్టులో ఆధారపరచునున్నట్లు నందిగామ ఏసీపీ తిలక్ వెల్లడించారు..