NTV Telugu Site icon

Father Gets Daughter Pregnant: కూతురిని గర్భవతిని చేసిన తండ్రి.. కోర్టు సంచలన శిక్ష

Court Verdict On Child Abus

Court Verdict On Child Abus

Nampally Court Verdict Life Imprisonment To Father Who Gets Daughter Pregnant: ఎన్ని చట్టాలు తీసుకొస్తున్నా.. మహిళలు & అమ్మాయిలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. ఒంటరిగా కనిపిస్తే చాలు.. కామాంధులు మృగాల్లా విరుచుకుపడుతున్నారు. కొందరు కామాంధులైతే వావివరసలు మరిచి.. సొంత చెల్లెళ్లు, కూతుళ్లపైనే అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఓ తండ్రి కూడా తన కూతురిపై ఇలాంటి దుశ్చర్యకే పాల్పడ్డాడు. భోజనంలో నిద్రమాత్రలు కలిపి.. లైంగిక దాడులకి పాల్పడి, గర్భవతిని చేశాడు. ఈ కేసులో నిందితుడికి కోర్టు సంచలన శిక్ష విధించింది. చచ్చేదాకా జైలులోనే ఉంచాల్సిందిగా తీర్పునిచ్చింది. ఆ వివరాల్లోకి వెళ్తే..

NTR30: NTR30 నుంచి డబుల్ ధమాకా.. అదొక్కటే ఆలస్యం

ఆంధ్రప్రదేశ్‌కి చెందిన దంపతులు.. బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కి వచ్చారు. ఫిలింనగర్‌లోని ఒక అపార్ట్మెంట్‌లో పనికి కుదిరారు. ఈ దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె(14) ఉన్నారు. కుమారుడు హాస్టల్లో ఉంటూ చదువుకుంటుండగా.. కుమార్తె ఇంటి వద్దనే ఉంటూ తొమ్మిదో తరగతి చదువుకుంటోంది. కట్ చేస్తే.. ఒక రోజు ఆ అమ్మాయి తీవ్ర కడుపునొప్పితో బాధపడటంతో, 2021 జూలైలో తల్లి ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లింది. బాలికను పరీక్షించిన వైద్యులు.. ఆమె మూడు నెలల గర్భవతి అని తేల్చారు. దీంతో కోపాద్రిక్తురాలైన తల్లి.. ఈ పని ఎవరు చేశారని కూతురిని నిలదీసింది. తండ్రే తనపై అత్యాచారం జరిపాడని ఆ బాలిక తెలిపింది. భోజనంలో నిద్రమాత్రలు కలిపి, తనపై లైంగిక దాడి చేసేవాడని చెప్పింది.

Jr NTR: ప్లేటు తిప్పేసిన ఆ డైరెక్టర్.. తారక్ ఫ్యాన్స్ ఆశలు గల్లంతు

కుమార్తె చెప్పిన మాటలతో ఖంగుతిన్న తల్లి.. జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించింది. తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారంపై పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేశారు. ఈ కేసుని విచారించిన నాంపల్లి 12వ అడిషనల్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి టీ. అనిత.. నేరం రుజువు కావడంతో తండ్రికి కఠిన శిక్ష విధించారు. జీవితకాలం జైలు శిక్షతో పాటు రూ.5 వేలు జరిమానా విధించారు. నిందితుడిని మరణించే వరకు జైల్లోనే ఉంచాలని కోర్టు తీర్పు ఇచ్చింది. అలాగే.. బాధితురాలికి రూ.7 లక్షల పరిహారం అందించాలని మండల్ లీగల్ సర్వీస్ అథారిటీని న్యాయస్థానం ఆదేశించింది.

Ravichandran Ashwin: చరిత్ర సృష్టించిన అశ్విన్‌.. ఆ ఘనత సాధించిన తొలి భారత బౌలర్