ఇంటిని మరచి జల్సాలకు అలవాటు పడినా భర్తను భరించలేక సుఫారీ ఇచ్చి మరీ దారుణంగా హత్య చేయించింది ఓ మహిళ.. ఈ దారుణ ఘటన తెలంగాణాలో వెలుగు చూసింది..ఈ హత్య జరిగి నాలుగు రోజులు అయిన భార్య అసలు ధోషి అని తెలడంతో ఈ ఘటన వెలుగు చూసింది..
వివరాల్లోకి వెళితే..నల్గొండ పట్టణ శివారులోని మిషన్ కాంపౌండ్ దగ్గర రఘురాములు అనే వ్యక్తి హత్య జరిగింది. అతడి హత్యకు భార్యే కారణమని తేలింది. దేవరకొండ పోలీస్ కార్యాలయంలో డిఎస్పి నాగేశ్వరరావు ఈ హత్యకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు.రఘురాములు స్టాంప్ వెండర్ గా పనిచేస్తున్నాడు. నగరంలోని విష్ణు కాంప్లెక్స్ లో కిడ్స్ వేర్ దుకాణం కూడా ప్రారంభించాడు. ఈ దుకాణం బాధ్యతను భార్య శ్రీలక్ష్మి చూసుకునేది. అటు ఉద్యోగం, ఇటు దుకాణం వదిలేసి రఘురాములు జల్సాలకు అలవాటుపడ్డాడు.. అప్పులు చేసుకుంటూ పోతున్నాడు.. తాగుడుకు బానిసగా మారడంతో భార్య దారుణనికి ఒడిగట్టింది…
భర్త ప్రవర్తన ఎప్పటికీ మారకపోవడంతో అతడిని అంతమొందించాలని భావించింది..హైదరాబాదులో ఉంటున్న స్నేహితురాలి భర్తతో పరిచయం పెంచుకుంది. భర్తను చంపడం కోసం అతడి సహాయం కావాలని కోరింది. దీనికోసం అతనితో ఇంస్టాగ్రామ్ కాల్ లో మాట్లాడేది. అలా చిలక రాజు అరుణ్ అనే అతనితో భర్తను చంపడం కోసం రూ.5 లక్షలకు సుపారి మాట్లాడుకుంది.. ప్లాన్ ప్రకారం మధ్యంలో నిద్ర మాత్రలు కలిపించింది..ఆ తర్వాత కదలకుండా చేసి రఘురాములు నోట్లో, ముక్కులో అరుణ్ సైనేడ్ పోశాడు. దీంతో రఘురాములు ఊపిరాడక చనిపోయాడు. ఆ తర్వాత అక్కడి నుంచి హైదరాబాద్ కు పారిపోయారు. రాత్రి 10 గంటల సమయంలో శ్రీలక్ష్మికి ఇన్స్టాగ్రామ్ కాల్ చేసి నీ భర్తను హత్య చేశామని అరుణ్ చెప్పాడు. రఘురాములు హత్య విషయంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులు భార్యను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా అసలు విషయం చెప్పింది.. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.. ఈ ఘటన పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..