NTV Telugu Site icon

Nalgonda: అదృశ్యమైన వ్యక్తి దారుణ హత్య

Murder

Murder

నాలుగు రోజుల క్రితం అదృశ్యమై వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం రసూల్ గూడలో గత నెల 31న రాజశేఖర్ అనే వ్యక్తి అదృశ్యమయ్యాడు. అయితే ఆయనను దారణంగా హత్య చేసినట్లు పోలీస్ విచారణలో తేలింది. రాజశేఖర్ మృతదేహాన్ని ఆయన పొలానికి సమీపంలోనే నిందితుడు పూడ్చిపెట్టారు. మృతదేహాన్ని వెలికి తీసి సంఘటన స్థలంలోనే డాక్టర్లు పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. నల్గొండ డీఎస్పీ, స్థానిక ఎమ్మార్వో ఇద్దరు డాక్టర్ల సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించారు. అదృశ్యం అయిన రోజే రాజశేఖర్ దారుణహత్యకు గురయ్యారని పోలీసులు నిర్థారించారు.

వివరాల్లోకి వెళ్తే నాలుగు రోజుల క్రితం అదృశ్యమైన రాజశేఖర్ను అతని స్నేహితుడు వెంకన్ననే దారుణంగా హత్య చేసినట్లు తెలుస్తోంది. హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణం అని పోలీసులు భావిస్తున్నారు. పక్కా ప్లాన్ ప్రకారమే రాజశేఖర్ని నందికొండ వెంకన్న హత్య చేశాడు. తాటిముంజలు నరికే కత్తితో మెడపై వెనక నుంచి నరికి రాజశేఖర్ను హత్య చేశాడు. హత్య అనంతరం తన వ్యవసాయం పొలం సమీపంలోని వాగులో రాజశేఖర్ డెడ్ బాడీని పాతి పెట్టాడు. కుటుంబ సభ్యులను తప్పదోవ పట్టించేందుకు రాజశేఖర్ బైక్, చెప్పులను ఉదయసముద్రం రిజర్వాయర్ సమీపంలో నిందితుడు వదిలివెళ్లాడు. కాగా తనకు ఏం తెలియనుట్లుగా రెండు రోజుల పాటు కుటుంబసభ్యులతో కలిసి రాజశేఖర్ కోసం వెతికాడు నిందితుడు వెంకన్న. తాటి ముంజుల వేసే బస్తాలో డెడ్ బాడీని పెట్టి నిందితుడు పూడ్చిపెట్టాడు. విచారణలో తాజాగా రాజశేఖర్ హత్యగా తేలింది.