NTV Telugu Site icon

Nalgonda : ఘోర ప్రమాదం.. ట్రావెల్ బస్సులో మంటలు, ఒకరు మృతి..

Nalgonda

Nalgonda

ఇటీవల బస్సు ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయి.. గత నెలలో వరుసగా మూడు ప్రమాదాలు జరిగాయి.. తాజాగా మరో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.. తెలంగాణ నల్గొండ జిల్లా మర్రిగూడ వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళుతున్న ఓ ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారని సమాచారం..

ప్రయాణికులు అంతా గాఢ నిద్రలో ఉండగా ఈ ప్రమాదం జరిగింది… బస్సులో మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బస్సును రోడ్డుపక్కన నిలిపి ప్రయాణికులను హెచ్చరించాడు. అయితే అప్పటికే మంటలు చుట్టుముట్టడంతో కొందరు ప్రయాణికులు అందులో చిక్కుకున్నారు. ఈ అగ్నిప్రమాదంలో ఒకరు మృతిచెందగా ఇంకొందరు తీవ్రంగా గాయపడ్డారు..

ఈ ప్రమాదం పై వెంటనే అలెర్ట్ అయిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఫైర్ ఇంజన్స్ కు సమాచారం అందించారు.. రంగంలోకి దిగిన సిబ్బంది దాదాపు అరగంటపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొని వచ్చారు.. గాయపడినవారిని హాస్పిటల్ కు తరలించారు. సమయానికి చికిత్స అందడంతో క్షతగాత్రులకు ప్రాణాపాయం తప్పింది.. ఈ ప్రమాదంలో ప్రయాణికుల లగేజ్ మొత్తం కాలి బూడిద అయ్యింది.. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది..