Nalgonda Auto Driver Case Mystery Solved: నల్గొండ జిల్లాలో మిస్టరీగా మారిన ఆటో డ్రైవర్ నరేశ్ మృతి కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. తొలుత అతని మరణం ప్రమాదవశాత్తు జరిగిందని భావించిన పోలీసులు.. ఆ తర్వాత హత్యేనని నిర్ధారించారు. తన భార్యతో సఖ్యతగా మెలుగుతుండడం చూసి అనుమానం పెంచుకున్న స్నేహితుడే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని తేల్చారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. మోతె మండలం అన్నారిగూడెం గ్రామానికి చెందిన పంది నరేశ్ (28), పడిశాల శంకర్ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. నరేశ్ ఆటో డ్రైవర్ కాగా.. శంకర్ వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. వీరిద్దరికీ పెళ్లిళ్లు అయ్యాయి.
Karimnagar: ‘నేను నాగకన్యను.. నాకు గుడి కట్టండి’.. యువతి వింత ప్రవర్తన
నరేశ్, శంకర్ మంచి స్నేహితులు కావడంతో.. ఒకరింటికి మరొకరు వచ్చి పోతుండేవారు. శంకర్ లేని సమయంలో కూడా.. నరేశ్ అతని ఇంటికి వచ్చి వెళ్తుండేవాడు. ఇక్కడే అసలు సమస్య వచ్చిపడింది. తన భార్యతోనూ నరేశ్ చాలా క్లోజ్‌గా ఉండటం, తాను లేని సమయంలో ఇంటికి రావడం చూసి.. శంకర్ అనుమానం పెంచుకున్నాడు. దీంతో.. అతనిపై కక్ష పెంచుకుని, హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. తన మిత్రుడైన మధుసూదన్ సహకారంతో.. నరేశ్ హత్యకు పథకం రూపొందించాడు. అందుకు అతనికి రూ. 30 వేలు ఇచ్చాడు. ప్లాన్ ప్రకారం.. నవంబర్ 26న మద్యం సేవిద్దామని నరేశ్‌కి కబురు పెట్టాడు. మధుసూదర్, నరేశ్, శంకర్ కలిసి విభళాపురం గ్రామ శివారులో ఒక స్టీల్ ప్లాంట్ వద్దకు వెళ్లారు. నరేశ్‌కి వాళ్లిద్దరి పూటుగా మత్యం తాగించారు. నరేశ్ మత్తులోకి జారుకున్నాక.. ఆటోలోనే ఆటోలోనే మెడకు తాడు బిగించి హత్య చేశారు. అనంతరం ఆటోను పక్కనే ఉన్న కాల్వలోకి తోసేసి, ప్రమాదంగా చిత్రీకరించారు.
Nora Fatehi: సల్మాన్ హీరోయిన్ పై పరువు నష్టం కేస్ వేసిన ‘నోరా’
తొలుత నరేశ్ మృతి ప్రమాదవశాత్తు జరిగిందని పోలీసులు అనుకున్నారు. అయితే.. అతని కుటుంబసభ్యులకు అనుమానం రావడంతో, పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తొలుత ఈ కేసు పోలీసులకు కొంచెం సవాలుగా మారింది. ఏ కోణంలోనూ ఈ మిస్టరీ వీడలేదు. చివరికి శంకర్ మీద అనుమానం వచ్చి, అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించారు. అప్పుడతను తన నేరం అంగీకరించాడు. తన భార్యతో సఖ్యతగా ఉండటం చూసి, వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతోనే చంపానని చెప్పాడు. అతనితో పాటు కేసులో భాగస్వామ్యులైన మధుసూదన్, వెంకటేశ్వర్లును అరెస్ట్ చేశారు.