Nalanda Crime: బిహార్‌లోని నలంద జిల్లాలో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. జిల్లాలో పట్టపగలు 18 ఏళ్ల యువకుడిని గుర్తుతెలియని దుండగులు హత్య చేసిన ఘటన సంచలనం సృష్టించింది. ఈ సంఘటన సర్మెరా పోలీస్ స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. యువకుడిని చంపిన అనంతరం దుండగులు పారిపోయారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు..
READ ALSO: Perni Nani: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి ఫైర్!
అసలేం జరిగిందంటే..
నలంద జిల్లాలోని చుహార్‌చక్ గ్రామం శివారులో గుర్తు తెలియని దుండగులు గ్రామానికి చెందిన బ్రిజ్ యాదవ్ కుమారుడు శిశుపాల్ కుమార్ అలియాస్ కరుపై కాల్పులు జరిపారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. ఈసందర్భంగా పలువురు గ్రామస్థులు మాట్లాడుతూ… శిశుపాల్ కుమార్ హత్య శత్రుత్వం, పాత పగల కారణంగా జరిగి ఉండవచ్చని చెప్పారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం బిహార్‌షరీఫ్ సదర్ ఆస్పత్రికి తరలించారు.
హత్య గురించి సదర్ డీఎస్పీ నూరుల్ హక్ మాట్లాడుతూ.. జూలై 12 – 13 తేదీలలో చుహార్‌చక్ గ్రామంలో కిషోరి యాదవ్ అనే వ్యక్తి దారుణంగా హత్య చేయబడ్డాడు. ఈ హత్య కేసులో శిశుపాల్ పేరు బయటికి వచ్చింది. ఈక్రమంలో తండ్రీకొడుకులు వారి పొలాల్లో పనికి వెళ్లినప్పుడు గుర్తుతెలియని దుండగులు శిశుపాల్ కుమార్‌పై కాల్పులు జరిపారు. కిషోరి యాదవ్ హత్యకు దుండగులు ప్రతీకారం తీర్చుకోవడానికి శిశుపాల్‌ను కాల్చి చంపి పారిపోయారని అనుమానం వ్యక్తం చేశారు. ఈ సంఘటన గురించి సమాచారం అందిన వెంటనే, సర్మెరా స్టేషన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం బీహార్ షరీఫ్ సదర్ ఆస్పత్రికి తరలించారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, త్వరలో నేరస్థులను గుర్తించి అరెస్టు చేస్తామని చెప్పారు.
READ ALSO: Power Icon: ఆ నోళ్లన్నీ మూయించే ఫ్రేమ్!
