NTV Telugu Site icon

Shocking Incident: ఇంటికి తీసుకెళ్లే మార్గంలో 10వ తరగతి విద్యార్థినిపై ఆటోడ్రైవర్ లైంగిక వేధింపులు..

Nagpur

Nagpur

Shocking Incident: నాగ్‌పూర్‌లో ఓ షాకింగ్ వీడియో వెలుగులోకి వచ్చింది. పాఠశాల నుంచి ఇంటికి తీసుకెళ్లే క్రమంలో ఓ ఆటో డ్రైవర్ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. 10 తరగతి విద్యార్థినిని పాఠశాల అయిపోయిన తర్వాత రోజూ ఇంటికి తీసుకెళ్లే ఆటోడ్రైవర్ ఆమె దగ్గరగా వచ్చి అనుచితంగా ప్రవర్తించడం, అనుచితంగా తాకిన సంఘటన కలకలం రేపింది. బాలికను ఆటో రిక్షా డ్రైవర్ ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి వేధింపులకు పాల్పడ్డాడు. విద్యార్థినిని రోజూ ఇంటికి తీసుకెళ్లే మార్గం కాకుండా వేరే ప్రాంతం నుంచి తీసుకెళ్లినట్లు తెలిసింది. ఈ ఘటన నాగ్‌పూర్‌లోని ఓంకార్ నగర్‌లో చోటు చేసుకుంది. ఆటోడ్రైవర్ వికృత చర్యల్ని వీడియో రికార్డ్ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

Read Also: Kesineni Nani: విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని రోడ్‌షో

బాలికపై వికృత చర్యకు పాల్పడటం, అనుచితంగా తాకడం, పదేపదే బాలికను తాకేందుకు ప్రయత్నించడం వంటివి వీడియోల రికార్డయ్యాయి. ఆ సమయంలో ఆమె ఆటోను పోనివ్వాలని కోరాడం, అసౌకర్యంగా కనిపిండచం వీడియోలో రికార్డయ్యాయి. పాఠశాల బాలిక తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నించినట్లుగా కనిపించింది. అతడి చర్యల నుంచి తప్పించుకునేందుకు ఆమె ప్రయత్నించింది. ఈ ఘటనపై మైనర్ బాలిక షాక్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. రెండేళ్ల నుంచి వేధింపులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. దారిలో వెళ్తున్న జంట ఈ ఉదంతాన్ని చిత్రీకరించడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. బాలిక తల్లిదండ్రులు అజ్ని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో, ఆటో డ్రైవర్‌పై పోక్సో కేసు నమోదు చేశారు. డ్రైవర్‌ని గంటల్లోనే పట్టుకున్నారు.

Show comments