NTV Telugu Site icon

Gwalior: గ్వాలియర్‌లో కాల్పులు.. అందరూ చూస్తుండగా నడిరోడ్డుపై వ్యక్తి హత్య

Gwalior

Gwalior

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో దారుణం జరిగింది. కాల్పులతో ఒక్కసారిగా దద్దరిల్లింది. నడిరోడ్డుపై ఒకరిపై కాల్పులకు తెగబడ్డారు. అందరూ చూస్తుండగానే కాల్పులు జరగడంతో ఒక్కసారిగా ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి: KCR: రాకింగ్ రాకేష్ కేసీఆర్ -‘కేశవ చంద్ర రమావత్’ రిలీజ్ ఆరోజే!

సోని సర్దార్ అని పిలువబడే జస్వంత్ సింగ్(45) పెరోల్‌పై ఇటీవల విడుదలయ్యాడు. 2016లో జరిగిన ఓ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. దాబ్రాలోని గోపాల్ బాగ్ సిటీలో నివసించే జస్వంత్ అక్టోబర్ 28న 15 రోజుల పెరోల్‌పై విడుదలయ్యాడు. అయితే గురువారం రాత్రి భోజనం చేసిన తర్వాత.. రోడ్డుపైకి వచ్చి స్థానికులతో సంభాషిస్తున్నాడు. ఇంతలో ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చారు. వచ్చీరాగానే తుపాకీ తీసుకుని కాల్పులకు తెగబడ్డారు. దీంతో అక్కడే ఉన్న జనాలు భయంతో పరుగులు తీశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. మూడు రౌండ్లు కాల్పులు జరపడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని గ్వాలియర్‌లోని ఆసుపత్రికి తరలించారు. కానీ ప్రయోజనం లేదు. చనిపోయినట్లుగా వైద్యులు ప్రకటించారు.

ఇది కూడా చదవండి: Supreme Court: చీఫ్ జస్టిస్ చంద్రచూడ్‌కు సుప్రీం ధర్మాసనం ఘనంగా వీడ్కోలు

జస్వంత్ సింగ్.. మంచి ప్రవర్తన కారణంగా అప్పుడప్పుడు పెరోల్‌పై విడుదలవుతుంటాడు. ఈసారి 15 రోజుల పాటు బయటకు వచ్చాడు. అయితే రాత్రిపూట సరదాగా కాలనీల్లోకి వచ్చి తిరుగుతూ సంభాషిస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే ప్రత్యర్థులు కాల్పులు జరిపి ప్రాణాలు తీశారు. గోపాల్‌బాగ్ సిటీ ప్రవేశం దగ్గర గార్డు లేకపోవడంతో నిందుతులు సులువుగా లోపలికి వచ్చి కాల్పులకు తెగబడ్డారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుల కోసం గాలిస్తున్నారు.

 

Show comments