NTV Telugu Site icon

Mumbai : డైపర్ లో కోటి రూపాయల బంగారాన్ని దాచిన భార్యాభర్తలు..

Gold (4)

Gold (4)

ఈమధ్య కాలంలో బంగారం అక్రమ రవాణా చెయ్యడం ఎక్కువైంది.. దేశంలోని ఏదొక ప్రాంతంలో ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తున్నాయి.. నిన్న హైదరాబాద్ లోని భారీగా బంగారాన్ని సీజ్ సంగతి తెలిసిందే.. ఈరోజు ముంబైలో కోటి రూపాయల విలువ కలిగిన బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు.. కోటి రూపాయలకు పైగా విలువైన రెండు కిలోల బంగారం డస్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు..

ముంబై కస్టమ్స్ అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. బంగారం డస్ట్ రూ. 1,05,27,331 విలువ చేసే అండర్‌గార్మెంట్స్‌లో దాచారు… సుమారుగా రెండు కేజిల విలువ కలిగిన బంగారాన్ని తమ మూడేళ్ల బాలుడి డైపేర్ లో దాచారు భార్యాభర్తలు.. ప్రొఫైలింగ్ ఆధారంగా, ముంబై ఎయిర్‌పోర్ట్ కస్టమ్స్ అధికారులు సెప్టెంబర్ 12, 2023న సింగపూర్ నుండి ప్రయాణిస్తున్న భారతీయ కుటుంబం నుండి 2.0 కిలోల బరువున్న 24 KT గోల్డ్ డస్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారాన్ని ఇద్దరు ప్రయాణికులు తమ ఇన్నర్‌గార్మెంట్స్‌లో, మూడేళ్ల  చిన్నారి డైపర్‌ లో దాచిపెట్టారు అని అధికారి తెలిపారు.. వారిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..

ఇకపోతే అంతకుముందు, కేరళలోని కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం లో ఎయిర్ కస్టమ్స్ ఇంటెలిజెన్స్ తన పురీషనాళంలో దాచిపెట్టిన 700 గ్రాముల బంగారు పేస్ట్‌తో ఒక వ్యక్తిని అరెస్టు చేసింది. పట్టుబడిన బంగారం విలువ రూ.40 లక్షలు ఉంటుందని అంచనా.. ఇలా రోజూ ఎక్కడోక రాష్ట్రంలో బంగారాన్ని అక్రమంగా తరలిస్తూనే ఉన్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి..